నాగచైతన్య – సమంత విడాకులపై నాగార్జున స్పందించారని, సమంత కోరిక మేరకే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని, ఇందులో చై చేసిందేం లేదన్నట్టు… ఈరోజు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దాంతో… ఈ విడాకులకు ఏకైక కారణం సమంతనే అన్న విషయం ఫోకస్ అయినట్టైంది. నాగచైతన్య తప్పని పరిస్థితుల్లో విడాకులు ఇచ్చినట్టు తేలింది. ఈ రోజుంతా ఇదే హాట్ టాపిక్.
అయితే దీనిపై ఇప్పుడు నాగార్జున మళ్లీ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో తన పేరుతో వస్తున్న వార్తల్లో నిజం లేదని, విడాకుల విషయంపై తానేం మాట్లాడలేదని, ఆ వార్తల్లో నిజం లేదంటూ.. నాగ్ ట్వీట్ చేశారు. పుకార్లని వార్తలుగా మార్చొద్దని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సో.. విడాకులపై నాగార్జున ఏం స్పందించలేదన్నమాట. నాగ్ చెప్పినట్టు వస్తున్న ఆ వార్తలో నిజం లేదన్నమాట. మరి… ఈ కామెంట్లు ఎలా బయటకు వచ్చాయి..? నిప్పులేనిదే పొగ రాదంటారు..? నాగ్ ఏమీ మాట్లాడకుండానే పొద్దున్నుంచి టీవీ ఛానళ్లు, వెబ్ సైట్లూ ఊదరగొట్టేస్తున్నాయా? వీడియో రూపంలో ఆ కామెంట్లు బయటపడితేనే తప్ప.. అప్పటి వరకూ నాగార్జున మాటల్నే నమ్మాలి.
The news in social media and electronic media quoting my statement about Samantha & Nagachaitanya is completely false and absolute nonsense!!
I request media friends to please refrain from posting rumours as news. #GiveNewsNotRumours— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 27, 2022