విభజన చట్టం ప్రకారం తమ అలవెన్స్‌లు.. ప్రయోజనాలు తగ్గించడానికి లేదని ఏపీ ప్రభుత్వ పీఆర్సీపై తక్షణం జోక్యం చేసుకోవాలంటూ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. తమ పరిధిలోకి రాదంటూ విచారణకు వచ్చిన సమయంలో న్యాయమూర్తులు చెప్పి చీఫ్ జస్టిస్ వద్దకు పంపేయడం న్యాయవర్గాల్లో సైతం చర్చకు కారణం అవుతోంది. ఈ రోజు ఆ పిటిషన్ జస్టిస్ సత్యనారాయణ ఎదుటకు విచారణకు వచ్చింది. అయితే ఆ పిటిషన్ పరిధి సింగిల్ జడ్జి కిందకు రాదని డివిజనల్ బెంచ్ పరిధిలోకి వస్తుందని జస్టిస్ సత్యనారామూర్తి తేల్చారు.
నిర్ణయం తీసుకునేలా చీఫ్‌జస్టిస్‌కు పంపాలని సూచించారు. ఇలా ఈ పిటిషన్‌పై విచారణను చీఫ్ జస్టిస్‌కు పంపడం ఇదే మొదటి సారి కాదు.. ఈ పిటిషన్‌ను మొదట నాలుగు రోజుల కిందట హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అమానుల్లా, జస్టిస్ భానుమతి ధర్మాసనం విచారణ జరిపింది. ఆ రోజు ఉదయం విచారణ జరిపిన సమయంలో కీలక వ్యాఖ్యలను ధర్మాసనం చేసింది. జీతాలు పెంచే అధికారం, అలాగే తగ్గించాలి ప్రభుత్వాలకు ఉంటుందని..పీఆర్సీ పర్సంటేజ్‌లపై చాలెంజ్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని వ్యాఖ్యానించింది. పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అనేది చెప్పాలని అడిగారు. ఆ రోజు మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ పిటిషన్ వేసిన కృష్ణయ్యతో పాటు సమ్మెకు నోటీసు ఇచ్చిన పీఆర్సీ సాధన సమితి సభ్యులను హైకోర్టుకు రావాలని న్యాయమూర్తి ఆదేశించారు.
అయితే వారు హాజరు కాలేదు. కానీ మళ్లీ విచారణ ప్రారంభమైన తర్వాత పిటిషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని, అదే సమయంలో విభజన చట్టానికి సంబంధించిన పిటిషన్ కూడా కాదని .. వ్యక్తిగత సర్వీస్‌కు సంబంధించిన మేటర్ కాబట్టి ఈ కోర్టులో విచారించలేమని చెప్పి.. వెరొకిరికి రిఫర్ చేయాలని చీఫ్ జస్టిస్‌కు పంపేశారు. ఇప్పుడు జస్టిస్ సత్యనారాయణ ముందుకు వస్తే ఆయన డివిజనల్ బెంచ్ కు సిఫార్సు చేయాలని సూచించారు.