ఆలియా భట్ తెలుగు తెరకు దగ్గరౌతుంది. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ద్వార మొదటి తెలుగు సినిమా సంతకం చేసింది. ఇప్పుడా సినిమా విడుదల కాకముందే మరో తెలుగు సినిమా ఒప్పుకుంది. ఎన్టీఆర్ కొరటాల కలయికలో రాబోతున్న సినిమాలో అలియాని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అయితే ఈ రెండే కాకుండా ఆమె మనసులో మరో టాలీవుడ్ హీరోతో సినిమా చేయాలని వుంది. ఆయనే అల్లు అర్జున్. ప్రస్తుతం ముంబాయిలో తెలుగు మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తుంది అలియా. ఇందులో బాగంగా అల్లు అర్జున్ పై తనకున్న ఇష్టాన్ని తెలియజేసింది.
”అల్లు అర్జున్ తో సినిమా చేయాలనీ వుంది. ఇది నా ఇష్టమే కాదు మా ఇంట్లో డిమాండ్ కూడా. పుష్ప చూసిన తర్వాత మా ఇంట్లో అంతా బన్నీకి ఫ్యాన్స్ అయిపోయారు. నన్ను ఇంట్లో ఆలు అని పిలుస్తారు. అల్లు తో ఆలు సినిమా ఎప్పుడు ? అని అడుగుతున్నారు. అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం వస్తే మరో ఆలోచన లేకుండా ఒప్పుకుంటా. అల్లు అర్జున్ నా ఫేవరేట్ స్టార్” అని తన మనసులో మాట బయటపెట్టింది అలియా.
పుష్ప సినిమా బాలీవుడ్ లో కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే. బన్నీ యాక్షన్ కి ఫిదా అయిపోయారు బాలీవుడ్ ఆడియన్స్. ఇకపై అల్లు అర్జున్ చేసే సినిమాలు దాదాపు బాలీవుడ్ వెళ్తాయి. అలియా బాలీవుడ్ లో టాప్ స్టార్. షో.. అల్లు, ఆలు కాంబినేషన్ కుదరడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చనే చెప్పాలి.