సీఎం జగన్‌కు ధ్యాంక్స్ చెప్పడానికే టాలీవుడ్ తారలు తాడేపల్లికి వచ్చినట్లుగా ఉంది. సీఎం జగన్‌తో దాదాపు గా గంట సేపు చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం అయిన తర్వాత క్యాంప్ ఆఫీస్ బయట ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో అందరూ జగన్‌కు ధ్యాంక్స్ చెప్పడమే కీలకమైన ప్రకటనగా భావించారు. ఒక్క చిరంజీవి మాత్రం జగన్ సమస్యలను సావధానంగా విన్నారని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని.. ఈ రోజు సమస్యలకు శుభం కార్డు పడిందన్నారు.
ఆయన కూడా మాట్లాడిన రెండు నిమిషాల్లో నాలుగైదు సార్లు సీఎం జగన్‌కు ధ్యాంక్స్ చెప్పారు. టిక్కెట్ ధరలపై కొన్ని నెలలుగా ఉన్న అనిశ్చితికి తెరపడినట్లేనని .. తెలంగాణలోలా ఏపీలోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనేది సీఎం ఆకాంక్ష అన్నారు. పాన్ ఇండియా సినిమాల విడుదల సమయంలో ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారని చిరంజీవి తెలిపారు. మూడో వారంలో జీవో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఇక ఈ ప్రెస్మీట్లో మాట్లాడిన మహేష్ బాబు, ప్రభాస్‌లకు ఏం మాట్లాడారో అర్థం కాక మాటకో సారి జగన్‌కు ధ్యాంక్స్ చెప్పారు. వారం . పది రోజుల్లోనే శుభవార్త వస్తుందని ఆరు నెలల నుంచి ఇండస్ట్రీ గందరగోళంలో ఉందని.. ఇవాళ చాలా రిలీఫ్ అని మహేష్ బాబు అన్నారు.సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినందుకు హీరో ప్రభాస్ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ సమస్యల విషయంలో సీఎం జగన్‌కు స్పష్టమైన అవగాహన ఉందని దర్శకుడు రాజమౌళి అన్నారు. మా విజ్ఞప్తులను సీఎం జగన్ విన్నారన్నారు. ఏ విధంగా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేసిన జగన్‌కు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు.
సినీ పరిశ్రమ ప్రముఖులు వచ్చి చర్చలు జరపడంతో సమస్యలు పరిష్కారం అవడానికి మార్గం సుగమం అయిందని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఎవరు పడితే వారు.. ఏది పడితే అది మాట్లాడినా చిరంజీవి పెద్ద మనసు చేసుకున్నారన్నారు. ఏపీలో షూటింగ్‌లు.. ఇతర ప్రభుత్వ పరమైన సహాయసహకారాల కోసం ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. మొత్తంగా జగన్‌కు కలిసి ధ్యాంక్స్ చెప్పడానికే ఈ రోజు సమావేశం జరిగినట్లుగా ప్రెస్‌మీట్ నడిచిపోయింద