జనగామలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. గాటు పదాలతో ఏం పీక్కుంటో చేసుకో అంటూ చెలరేగిపోయారు. ” దేశం నుంచి నిన్ను తరిమేస్తాం.. మాకివ్వాల్సినవి ఇవ్వకుండా ఇచ్చేవాడిని తెచ్చుకుంటాం.. ఖబడ్దార్ మోదీ” అని నినదించారు. సిద్దిపేట ప్రజలు పంపిస్తే తెలంగాణ సాధించామని.. మీరందరూ పంపిస్తే ఢిల్లీ కోటను బద్దలు కొడతామని” తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
అవసరమైతే ఢిల్లీ దాకా వస్తామని.. మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. ” జాగ్రత్త నరేంద్రమోదీ… ఇక్కడ తెలంగాణ పులిబిడ్డ.. మీ ఉడత ఊపులకు పిట్ట బెదిరింపులకు భయపడేవాడు ఎవడూ లేడు…” అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. మంచి మాటలతో చెబుతున్నామని.. మీ జాగ్రత్తలతో మీరుండాలని..మా జాగ్రత్తలతో మేముంటామని మాతో పెట్టుకోవద్దని కేసీఆర్ మోడీని హె్చచరించారు. మా శక్తి ముందర మా బలం ముందర మేం ఊదితే మీరు అడ్రెస్ కూడా లేకుండా పోతారన్నారు. రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉడత ఊపులకు భయపడేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎంకేసీఆర్ వ్యూహాత్మకంగా మోడీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి ప్రస్తావన తేలేదు. కానీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని… మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నారని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఢిల్లీ కోటలు బద్దలు కొట్టేందుకు మీరు పంపించాలని తెలంగాణ ప్రజల మద్దతు కోరే ప్రయత్నం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి..!