గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో ప్రతినాయకుడిగా జగపతిబాబుని ఎంచుకున్నారు. నిజానికి ఈ క్యారెక్టర్ కోసం ముందుగా రాజశేఖర్ ని సంప్రదించింది చిత్రబృందం. ఆయన కి కూడా ఈ క్యారెక్టర్ నచ్చి ఓకే చెప్పాడు. కానీ పారితోషికం దగ్గరే పేచీ వచ్చింది. ఈ క్యారెక్టర్ కోసం రాజశేఖర్ రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. అయితే సోలో హీరోగా గా ఎంచుకున్నా రాజశేఖర్ కి అంత ఎవరూ ఇవ్వడం లేదు. చిత్రబృందం రూ.4 కోట్ల వరకూ బేరం ఆడినట్టు టాక్. కానీ రాజశేఖర్ కిందకి దిగకపోవడంతో… నిర్మాతలు వెనక్కి తగ్గి జగపతిబాబుతోసర్దుకుపోయారు.
గోపీచంద్ సినిమాలో జగపతిబాబు విలన్ అనడం కంటే, గోపీచంద్ సినిమాలో రాజశేఖర్ విలన్ అంటే కాస్త క్రేజ్ వచ్చేది. అందుకే నిర్మాతలు సైతం 4 కోట్ల వరకూ భరించడానికి రెడీ అయ్యారు. కానీ.. ఒక కోటి దగ్గర లెక్క మారిపోయింది. రాజశేఖర్ ఈ సినిమా ఒప్పుకోవడం వల్ల… కమర్షియల్ గా ఈ సినిమాకి వచ్చే ప్లస్ పాయింట్స్ ఏమీ ఉండవు. గోపీచంద్ మార్కెట్ ఎంత ఉందో, అంతకే ఈ సినిమా అమ్ముడుపోతుంది. కానీ ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి ఏర్పడుతుంది. అందుకే.. నిర్మాతలు చివరి నిమిషం వరకూ రాజశేఖర్ నే ఎంచుకోవాలని ప్రయత్నించారు. కానీ కుదర్లేదు. నిజానికి ఇలాంటి ఆఫర్లు రాజశేఖర్‌కి ఇది వరకూ వచ్చాయి. కానీ ఏదో ఓ కారణంతో ఆయా ఆఫర్లని ఆయన వదలుకున్నారు. నిజంగా రాజశేఖర్‌కి పారితోషికం నచ్చక ఆయా సినిమాలు చేయడం లేదా? లేదంటే `నో` చెప్పడం ఇష్టం లేక.. ఇలా పారితోషికం వంక పెడుతున్నారా? అనేది సందేహంగా మారిందప్పుడు.