కాంగ్రెస్ పార్టీతో సాఫ్ట్‌గా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు వ్యూహాత్మకంగా తెలంగాణలో ఆ పార్టీకి పిల్లర్‌గా మారిన రేవంత్ రెడ్డిపై గురి పెట్టినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్‌పై విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫిర్యాదులు చేస్తున్నారు. అదీ కూడా నేరుగా రాహుల్ గాంధీకి.. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు వెళ్లేలా చేస్తున్నారు. కేసీఆర్ మూడు రోజుల బర్త్ డే వేడుకలు జరుపుకోవడంపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాటిని ఓ పత్రికి కాస్త భిన్నంగా రిపోర్ట్ చేసింది. కేసీఆర్ చావును రేవంత్ కోరుకుంటున్నారన్నట్లుగా రాసింది. కానీ రేవంత్ అన్నది అది కాదు.
అయితే కేటీఆర్ వెంటనే ఆ పేపర్ క్లిప్పింగ్‌తో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కేసీఆర్ మానవత్వం ఉన్న మనిషిగా సోనియాపై బీజేపీ సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తే మీ పీసీసీ చీఫ్ కేసీఆర్ చావును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారితోనే కాంగ్రెస్ నడిపేది అన్నట్లుగా ట్వీట్ చేశారు. కేటీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి శశిధరూర్ గురించి చేసిన వ్యాఖ్యల ఆడియోను టీఆర్ఎస్ నేతలు వైరల్ చేసి… కాంగ్రెస్ హైకమాండ్‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. అది కాస్త కలకలం రేపింది.
రేవంత్ వ్యూహత్మకంగా వెంటనే ధరూర్‌కు క్షమాపణలు చెప్పి వివాదాన్ని ముగించారు. ఆ తర్వాత వీలైనప్పుడల్లా రేవంత్‌ను టార్గెట్ చేసి.. కాంగ్రెస్ పట్ల టీఆర్ఎస్ సాఫ్ట్‌గానే వ్యవహరిస్తోంది. బహుశా కాంగ్రెస్ హైకమాండ్‌కు ఇది సంకేతాలివ్వడం అని భావిస్తున్నారు. రేవంత్ ను సైడ్ చేస్తే తాము స్నేహహస్తానికి సిద్ధంగా ఉన్నామన్న ఓ రకమైన భావం ఇందులో ఉందంటున్నారు. అయితే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నమ్మడం అంత తేలికగా జరిగేది కాదన్న అభిప్రాయం ఆ పార్టీలో ఉంది. గత అనుభవాలు అలా ఉన్నాయి మరి !