నిన్నటిదాకా పోలీస్ బాస్‌గా చక్రం తిప్పిన గౌతం సవాంగ్‌కు ఇప్పుడు ఎక్కడా లేనంత టెన్షన్ వచ్చి పడింది. వీఆర్ఎస్ తీసుకుని తాము ఇస్తున్న పదవి తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. కానీ ఆయన మాత్రం ఇప్పటి వరకూ తనకు అలాంటి ఆలోచన ఉన్నట్లుగా బయట పెట్టుకోలేదు. వీఆర్ఎస్ ఆప్లయ్ చేస్తూ ఎలాంటి పత్రాన్ని సెక్రటేరియట్‌కు పంపలేదు. దీంతో సవాంగ్ అనుమతి లేకుండానే ప్రభుత్వం ఎపీపీఎస్సీ చైర్మన్ పోస్టును ప్రకటించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గౌతం సవాంగ్ కు ఇంకా పదిహేడను నెలల సర్వీస్ ఉంది. ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు యూనిఫాం వదిలేసి ఓ పోస్టింగ్ కోసం ఆశపడితే తర్వాత పరువు పోతుందన్న భయంలో ఆయన ఉన్నారని చెబుతున్నారు. కేంద్ర సర్వీసులకు వెళ్లి కేంద్ర బలగాలకు సంబంధించి ఏదో ఓ విభాగానికి డీజీగా పోస్టింగ్ తెచ్చుకుంటే తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ వంటి పోస్టులకు అర్హత సాధించినట్లవుతుందని సవాంగ్ భావిస్తున్నారు. బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయాలతో ఆయన ఆ దిశగా ప్రయత్నిస్తున్నారని ఉన్నతాధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
గౌతం సవాంగ్‌కు ఇష్టం ఉంటే ఎపీపీఎస్సీ చైర్మన్ పదవిని ఆయన ఈ పాటికి అంగీకరించి ఉండేవారు. ఆయన ఏమీ చెప్పలేదంటే మొహమాట పడుతున్నారని అర్థమని అంటున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం సవాంగ్ తో ఎలాగైనా వీఆర్ఎస్ చేయించి.. ఎపీపీఎస్సీ చైర్మన్ పోస్టులో కూర్చోబెట్టాలని ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.