ఇటీవల ఓ పెద్ద సినిమా విడుదలైంది. భారీగా ఖర్చు పెట్టి తీసిన సినిమా అది. విడుదలకు ముందు మంచి బజ్ వచ్చింది. తీరా చూస్తే.. ఫస్ట్ డే, ఫస్ట్ షోకే అది అట్టర్ ఫ్లాప్ అని తేలిపోయారు. ఆ సినిమాని కొన్నవాళ్లంతా నిలువునా మునిగిపోయారు. నిర్మాత సరే సరి. ఆ సినిమాతో లాభ పడింది హీరో మాత్రమే. ఎలా గంటే…. గత సినిమాలకంటే.. ఆ సినిమాకి రెండు కోట్ల పారితోషికం ఎక్కువ అందుకున్నాడు. హీరోల పారితోషికం ఎంత ఉన్నా సరే.. వాయిదాల పద్ధతిలోనే ఇస్తారు నిర్మాతలు. అడ్వాన్స్ కొంత, మేకింగ్ లో కొంత, బిజినెస్ జరుగుతున్నప్పుడు కొంత, సినిమ పూర్తయ్యాక ఇంకొంత.. ఇలా. కానీ ఆ హీరో షరతు ఏమిటంటే.. మేకింగ్ లో ఉండగానే, పారితోషికం క్లియర్ అయిపోవాలి. ఆ కండీషన్ కి ఒప్పుకునే నిర్మాత సినిమా మొదలెట్టాడు.
అయితే… డబ్బింగ్ దగ్గర ఓ మెలిక పెట్టాడు హీరో. మరో రూ.2 కోట్లు ఇస్తే తప్ప డబ్బింగ్ చెప్పను.. అంటూ మొరాయించాడట. అదేంటి? అది మన అగ్రిమెంట్ లో లేదు కదా? అని నిర్మాత మొత్తుకున్నా వినలేదట. ”ఈ సినిమాకి బిజినెస్ బాగా జరిగింది కదా.. ఈ సినిమా బయటకు వచ్చేటప్పటికి నా రేంజు పెరిగింది..” అంటూ.. లేనిపోని లాజిక్కులు తీశాడట. హీరో డబ్బింగ్ చెబితే గానీ సినిమా బయటకు రాదు. పైగా చివరి నిమిషాల్లో ఆ సినిమాని ప్రీ పోన్ చేశారు. దాంతో… హీరోకి 2 కోట్లూ ఇచ్చి డబ్బింగ్ చెప్పించుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా డిజాస్టర్ అయిపోయింది. ఇలాంటి హీరోలుంటే.. ఇక నిర్మాతలు మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా ఏం లాభం..?