డాన్స్ మాస్టర్ గా రాజు సుందరం బాగా పాపులర్.చాలామంది హీరోలకు ఆయన ఫేవరెట్ డాన్స్ మాస్టర్. అయితే ఎప్పటి నుంచో.. ఆయన దర్శకుడు అవ్వాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. స్క్రిప్టులు రెడీ చేయడం, హీరోలకు వినిపించడం జరుగుతూనే ఉన్నాయి. మహేష్ బాబు లాంటి అగ్ర హీరోల కోసం కూడా ఆయన కథలు రాసుకున్నారు.కానీ.. ఆ ప్రాజెక్టులేం వర్కవుట్ అవ్వలేదు. ఎట్టకేలకు ఇప్పుడు రాజు సుందరం మెగాఫోన్ పట్టి, యాక్షన్ చెప్పబోతున్నారు.
శర్వానంద్ కోసం రాజు సుందరం ఓ కథ రెడీ చేశారు. అది ఓకే అయిపోయింది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. `ఆడవాళ్లూ మీకు జోహార్లూ` తరవాత.. శర్వా నటించే చిత్రమిదే. ఏప్రిల్, మేలలో ఈ సినిమా క్లాప్ కొట్టుకోనుంది. `ఆడవాళ్లూ మీకు జోహార్లూ` మార్చి 4న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఆ తరవాత `ఒకే ఒక జీవితం` లైన్ లో ఉంది.