ఓ హిట్టు ఇచ్చే బూస్టు అంతా ఇంతా కాదు. కొత్త ఎనర్జీ వస్తుంది. ప్రయోగాలు చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి కావల్సినంత ఉత్సాహాన్ని అందిస్తుంది. `ఇస్మార్ట్ శంకర్`తో ఆ ఎనర్జీ పూరిలోకి వచ్చేసింది. ఆ సినిమాతో పాత పూరి బయటకు వచ్చాడు. చక చక సినిమాలు తీయడం మొదలెట్టాడు. తన కెరీర్‌లో తొలిసారి ఓ పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు పూరి. అదే… `లైగర్`. ఆ వెంటనే `జనగనమణ`నీ లైన్‌లోకి తీసుకురాబోతున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే. లైగర్ పూర్తవ్వగానే, జగగనమణ` మొదలైపోతుంది. అక్కడితో ఆగడం లేదు పూరి. ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ సినిమా తీయబోతున్నాడు. దానికి సంబంధించిన కథ రెడీ అయిపోయింది. `జనగనమణ` తరవాత.. ఓ హాలీవుడ్ ప్రాజెక్టు చేయబోతున్నానని పూరి ప్రకటించేశాడు. రాబోయే సినిమాలన్నింటికీ పూరినే నిర్మాత కూడా. ప్రస్తుతం పూరి దృష్టి లైగర్ పై ఉంది. విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.