బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పని గట్టుకుని ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లారు. ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముద్రగడ నిర్వహించే కాపు జేఏసీ నేతలు కూడా అక్కడికి వచ్చారు. వారందరితో జీవీఎల్ మాట్లాడారు. అందర్నీ బీజేపీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అయితే తర్ాత ప్రెస్ మీట్లో మాత్రం కాపు రిజర్వేషన్ గురించే ఎక్కువ మాట్లాడారు. బ్రిటిష్ కాలం నుండి ఉన్నటువంటి కాపు రిజర్వేషన్ ప్రస్తుత తరుణంలో లేకపోవడం చాలా బాధాకరమని అన్యాయమని జీవీఎల్ వ్యాఖ్యానించారు. అయితే కాపుల రిజర్వేషన్ అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదేనని తేల్చారు.
టీడీపీ హయాంలో పంపిన రిజర్వేషన్ బిల్లును తిప్పి పంపారు. అయితే కేంద్రం ఇచ్చిన పది శాతం ఈబీసీ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇచ్చారు. ఉత్తర్వులు ఇచ్చారు. సర్టిఫికెట్లు కూడా జారీ చేయడం ప్రారంభించారు. కానీ జగన్ సర్కార్ రాగానే వాటిని నిలిపివేసింది. ఏ ఒక్క కాపు నాయకుడు కూడా అడగలేదు. దీంతో పట్టించుకునేవారు కరవయ్యారు. టీడీపీ హయాంలో ఉద్యమం చేసిన ముద్రగడ కూడా జగన్కు సపోర్ట్ చేస్తన్నారు. ఐదు శాతం రిజర్వేషన్లు తీసేసినా ఆయనకు నొప్పి కలగలేదు.
ఇప్పుడు బీజేపీని కాపు సామాజికవర్గానికి దగ్గర చేసుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. దులో భాగంగా ముద్రగడను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ముద్రగడ వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని ఇతర బీజేపీ నేతలు గొణుక్కుంటున్నారు. కానీ ఏపీ బీజేపీని ఎవరూ పట్టించుకోవడంలేదు.. జీవీఎల్ మాత్రమే ఇప్పుడు బాధ్యత తీసుకున్నారు. అందుకే్ తన వంతుగా ఎవరినైనా జాయిన్ చేయాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.