విజయ్ దేవర కొండ మళ్ళీ తనదైన శైలిలో ఓ ట్వీట్ చేశాడు. ఒక ‘లవ్ సింబల్ పెట్టి న్యూస్” అని ట్వీట్ చేశాడు. అంతా నాన్సెన్స్ అని కొట్టిపారేశాడు. ఇంతకీ విజయ్ ట్వీట్ వెనుక కారణంలోకి వెళితే.., విజయ్ – రష్మిక మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని ఎప్పటి నుంచో రూమర్స్ వున్నాయి. ఈ రోజు మళ్ళీ ఆ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది చివరిలో విజయ్, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. కొన్ని ప్రముఖ వెబ్ పోర్టల్స్ కూడా ఈ వార్తని ప్రచురించాయి.
దీంతో విజయ్ ట్విట్టర్ కి పని చెప్పాల్సివచ్చింది. ”ఎప్పటిలానే నాన్సెన్స్. డోంట్ వీ జస్ట్.. లవ్.. న్యూస్ ” అని ట్వీట్ చేశాడు విజయ్. దీంతో విషయం ప్రస్థావించకుండానే వివరణ ఇచ్చినట్లయింది. ప్రస్తుతం లైగర్ తో బిజీ గా వున్నాడు విజయ్. తన ధ్యాసంతా లైగర్ పైనే వుంది. అటు రష్మిక కూడా తన ప్రాజెక్ట్‌లతో బిజీగా వుంది. ఇలాంటి సమయంలో పెళ్లి రూమర్స్ విజయ్ ని చిరాకు పెట్టాయి. దీంతో తనదైన శైలిలో రూమర్స్ కి చెక్ పెట్టాడు రౌడీబాయ్.