భీమ్లా నాయక్ కి ఊపు తెచ్చిన పాట.. టైటిల్ సాంగే. తమన్ ఈ పాటని ఇరగ్గొట్టాడు. ఆ పాట.. భలే పాపులర్ అయ్యింది. ఈ పాటని తెరపై ఎప్పుడు చూద్దామా? అని ఫ్యాన్స్ వెయిటింగ్. అయితే.. ఈ పాట సినిమాలో కనిపించడం లేదు. ఈ సినిమా ఎండ్ కార్డ్స్ లో ఈ పాటని వాడుతున్నారని సమాచారం. సినిమా అంతా అయిపోయాక… ప్రేక్షకులు సీట్ల నుంచి లేచి, ఇళ్లకుబయల్దేరినప్పుడు.. ఎంత మంచి పాట వస్తే ఏం లాభం? ఇంత మంచి పాటకి సరైన ప్లేస్మెంట్ దొరకలేదా?
బంగారం సినిమా గుర్తుందా? అక్కడా అదే జరిగింది. నిజానికి హీరో ఇంట్రడక్షన్ పాట అది. తీసుకెళ్లి క్లైమాక్స్ ముందు పెట్టారు. అప్పటికే సినిమాపై ఓ అభిప్రాయానికి వచ్చేశారు ఫ్యాన్స్. దాంతో పాటలో పవన్ ఎంత దుమ్ము రేపినా, ఆ పాట రీచ్ కాలేదు. ఇప్పుడు లాలా.. భీమ్లా పాట విషయంలో కూడా అదే చేస్తోంది టీమ్. నిజానికి ఈ పాటని సినిమాలో కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా వాడదాం అనుకున్నారు. కానీ… చివర్లో మనసు మార్చుకుని పిక్చరైజ్ చేశారు. అయితే దాన్ని ఇప్పుడు ఎండ్ టైటిల్స్ లోకి తీసుకొచ్చారు. త్రివిక్రమ్ ఎందుకిలా చేశాడో మరి.