నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేనిల సినిమా ఫుల్ స్వింగ్ లో వుంది. మొన్ననే షూటింగ్ మొదలైన ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా బయటికి వచ్చింది. బాలయ్య బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ అభిమానులని అలరించింది. ఈ సినిమాకి వీర సింహా రెడ్డి అనే టైటిల్ ప్రచారంలో వున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో బాలయ్యది డబుల్ యాక్షన్. పూర్తి యాక్షన్ లో సాగే ఈ సినిమాలో దాదాపు 12 ఫైట్లు ఉంటాయట. యుఎస్ లో ఓ భారీ చేజ్ సీన్ కూడా వుంది. దిని కోసం స్పెషల్ గా యాక్షన్ యూనిట్ ని రంగంలోకి దించి చేజ్ ని డిజైన్ చేశారని తెలిసింది. మైత్రీ మూవీస్ భారీగా ఈ సినిమాని నిర్మిస్తుంది. బాలయ్య కెరీర్ లోనే హయ్యెస్ట్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో వుండబోతున్నాయని తెలుస్తుంది. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.