వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుపై ఏర్పడిన సస్పెన్స్‌కు తెర పడింది. వైఎస్ షర్మిలకు ఊరట లభించింది. వైఎస్ఆర్టీపీ పేరుపై వ్యక్తమయిన అభ్యంతరాలను ఈసీ తోసి పుచ్చింది. దీంతో పేరు మార్చాల్సిన పరిస్థితుల నుంచి షర్మిల బయటపడ్డారు. తెలంగాణలో రాజకీయం చేయాలని నిర్ణయించుకున్న షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించారు. ఈసీకి దరఖాస్తు చేశారు. ఈసీ నిబంధనల ప్రకారం ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ప్రకటన ఇచ్చింది.
ఈసీ ప్రకటనతో కడప జిల్లాకు చెందిన కొంత మంది గతంలో అన్న వైఎస్ఆర్ పార్టీని ప్రారంభించారు. వైఎస్ఆర్ పేరును ఉపయోగించుకునే హక్కు తమకే ఉందని వారు వాదిస్తున్నారు. గతంలో ఢిల్లీ హైకోర్టులోనూ వైఎస్ఆర్సీపీపై కేసు వేశారు.ఈ కారణంగా వైఎస్ఆర్ సీపీ నేతలు తమ పార్టీని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా చెప్పుకోవడం ప్రారంభించారు. కొత్తగా వైఎస్ఆర్ పేరుతో షర్మిల పార్టీ ప్రారంభించడంతో వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈ కారణంగా వేరే పేరును సూచించాలంటూ ఈసీ షర్మిల పార్టీ వర్గీయులకు సమాచారం ఇచ్చారు. అయితే చివరికి అన్ని అభ్యంతరాలను షర్మిల పార్టీ ప్రతినిధులను పరిష్కరించడంతో పార్టీ పేరును ఖరారు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆమోదముద్ర వేసినట్లుగా సమాచారం పంపిది. షర్మిల మళ్ళీ పాదయాత్రను మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నారు. మార్చ్ 5 నుంచి పాదయాత్ర మొదలుపెట్టే అవకాశం ఉంది.