‘అలా ఎలా’ అనే చిన్న సినిమాతో తెరపైకి వచ్చింది హెబ్బా పాటిల్. అయితే రెండో సినిమానే సంచలనంగా చేసింది. కుమారి 21f చూసిన కుర్రకారుకి హెబ్బా తెగ నచ్చేసింది. తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. అయితే బ్యాడ్ లక్.. ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించలేదు. దానికి తోడు హెబ్బా కథల ఎంపికలో కొన్ని తప్పులు చేసింది. అయితే కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హెబ్బా పాటిల్ రామ్ కార్తిక్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి తెలిసినవాళ్ళు అనే టైటిల్ పెట్టారు. ప్లనవ్ కోనేటి ఈ సినిమాకి దర్శకుడు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ సినిమాపై చాలా నమ్మకంగా వుంది హెబ్బా. ఖచ్చితంగా ఈ సినిమాతో తనకి కొత్త బ్రేక్ వస్తుందని కాన్ఫిడెంట్ గా వుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల మ్యూజిక్.