మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండు సినిమాలు చేజారినా వాటి స్థానంలో మరో రెండు సినిమాలను చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘ఫీల్ మై లవ్’ సినిమా చేస్తున్న వరుణ్ తర్వాత సినిమా శ్రీనువైట్లతో తీయాలని ఫిక్స్ అయ్యాడు. ఆగడు, బ్రూస్ లీ ఫ్లాప్ అయినా స్టార్ డైరక్టర్ గా శ్రీనువైట్లకి ఉన్న క్రేజ్ ఏం తగ్గలేదు.
వరుణ్ తేజ్ తో స్టోరీ డిస్కషన్ జరిపిన శ్రీనువైట్ల సినిమా ఓకే చేయించుకున్నాడు. ఈ సినిమాను నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ నే కావాలని పట్టుపట్టాడట వరుణ్ తేజ్. గోపీచంద్ తో తీసే సినిమాలో రకుల్ ని ఓకే చేయగా ఆ సినిమా తన నుండి సాయి ధరం తేజ్ కు షిఫ్ట్ అయ్యింది. అయితే సినిమా మారినా హీరోయిన్ మాత్రం రకులే అని ఫిక్స్ అయ్యాడు వరుణ్ తేజ్.
శ్రీనువైట్ల ఇదవరకు బ్రూస్ లీ ఆమెతో చేశాడు కాబట్టి ఆమెను ఓకే అనేశాడట. నాన్నకు ప్రేమతో సక్సెస్ తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రకుల్ వెంట కుర్ర హీరోలు కూడా పడుతున్నారు. మరి వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్ ల రొమాన్స్ ఏ మేరకు హిట్ సాధిస్తుందో చూడాలి.