వైసీపీ అధినేత జగన్‌కు చెందిన సాక్షి టీవీకి అనుమతులను కేంద్రం పునరుద్ధరించలేదు. కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సాక్షి టీవీ యాజమాన్యం వ్యూహాత్మకంగా సాక్షి టీవీ మూసేస్తే ఆరు వందల మంది రోడ్డున పడతారని ఓ పదిహేను మంది ఉద్యోగుల పేర్లతో హైకోర్టును ఆశ్రయించింది. ఉద్యోగుల కోణంలో ఆలోచించి హైకోర్టు కొద్ది రోజుల రిలీఫ్ ఇచ్చిది. వచ్చే నెల పదకొండో తేదీన ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఆ సమయానికి కేంద్రం నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ రాకపోతే.. ఎందుకు ఇవ్వలేదో కారణాలు చెబితే సాక్షి టీవీని మూసేయాల్సిందే.
ఫిబ్రవరి ఒకటో తేదీన కేరళకు చెందిన మీడియా వన్ అనే టీవీ చానల్‌ను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ చానల్‌కు ఇచ్చిన లైసెన్స్‌ను రాత్రికి రాత్రి రద్దు చేస్తూ సమాచారం పంపారు. దీంతో ఆ చానల్ ప్రసారాలు ఆగిపోయాయి. కేంద్రం ఆదేశాలపై మీడియా వన్ సంస్థ కేరళ హైకోర్టులో పిటిషన్ వేసి పోరాడుతోంది. అప్పుడే సాక్షి టీవీకి సెక్యూరిటీ అనుమతులు కూడా ఇవ్వలేదని తెలిసింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి ఉద్యోగుల పేర్లతో హైకోర్టుకు వెళ్లి సాక్షి టీవీ ఉత్తర్వులు తెచ్చుకుంది.
తమకు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవడానికి కారణాలేమిటో కేంద్రం చెప్పలేదని సాక్షి టీవీ ఉద్యోగులు పిటిషన్లో చెప్పారు. అయితే మలయాళ మీడియా వన్ చానల్ నిలుపుదలకు కారణాలేమిటో కేంద్రం జారీ చేసిన నోటీసులో లేవు. రక్షణ పరమైన అంశాలతోనే లైసెన్స్ రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది. అదేంటో తమకూ తెలియనది మీడియా వన్ టీవీ చానల్ కోర్టులో వాదిస్తోంది. ఇక్కడ సాక్షి టీవీ కూడా చెబుతోంది. దేశ అంతర్గత భద్రతకు సంబంధించి కొన్ని అంశాలను బయట పెట్టలేమని కేంద్రం చెబుతోంది. కేంద్రం చెప్పే సమాధానంతో హైకోర్టు సంతృప్తి పడితే.. కేంద్రం ఆదేశాలను అమలు చేసుకోవచ్చని ఆదేశించే అవకాశం ఉంది. అదే జరిగితే సాక్షి టీవీ మూత తప్పదని అంచనా వేస్తున్నారు.
మరో వైపు కేంద్రంతో తమకు ఉన్న సన్నిహిత సంబంధాలతో సాక్షి టీవీకి సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం వైసీపీ నేతలు తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ సీరియస్ ఇష్యూస్ ఉన్నందున ఏమీ చేయలేకపోతున్నామన్న అభిప్రాయంతో ఎక్కువ మంది ఉన్నారు. ఆ సీరియస్ ఇష్యూస్ ఏమిటో తెలియాల్సి ఉంది.