ప్రభుత్వంపై దూకుడగా విమర్శలు చేస్తున్న అయ్యన్న పాత్రుడిని ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న ప్రయత్నంలో చాలా కాలంగా అధికార పార్టీలో ఉంది. ఆయన ఏం మాట్లాడినా కేసులు పెడుతున్నారు. అరెస్టుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఫలితం ఉండటం లేదు. నాలుగు రోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల అయ్యన్నపాత్రుడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత సీఎం జగన్పై అయ్యన్నపాత్రుడు అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని ఓ వైఎస్ఆర్సీపీ కార్యకర్త నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే నాలుగు సెక్షన్ల కిందకేసు నమోదు చేసిన పోలీసులు నర్సీపట్నంలోని ఆయన ఇంటి వద్దకు వచ్చారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని చెప్పి గోడకు నోటీసులు అంటించారు.ఆ తర్వాత పోలీసులు వెళ్లలేదు. పైగా సాయంత్రానికి సీఆర్పీఎఫ్ బలగాలను తెప్పించారు. దీంతో అరెస్ట్ కోసమని డిసైడన అయ్యన్న అనచురులు ఇంటికి వచ్చేశారు. కొన్ని వేల మంది రావడంతో వారిని కంట్రోల్ చేయడం కష్టమని నిర్దారణకు వచ్చి అరెస్ట్ చేయలేకపోయారు.
ఉదయమే హైకోర్టులో అయ్యన్నపాత్రుడు తరపు లాయర్ పిటిషన్ వేశారు.పోలీసుల చర్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెట్టారని వాదించారు. దీంతో ఈ కేసులో తదుపరి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. అయ్యన్ను అరెస్ట్ చేయాలన్న పోలీసుల ప్రయత్నాలకు హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడినట్లయింది. అయ్యన్నపాత్రుడిపై ఇప్పటికి మూడు, నాలుగుసార్లు కేసులు నమోదు చేశారు. ఓ సారి అట్రాసిటీ కేసు.. నిర్బయ కేసు కూడా పెట్టారు. అవన్నీ తప్పుడు కేసులని అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించి అరెస్ట్ నుంచి రక్షణ పొందారు.