”భీమ్లా నాయక్” సినిమా పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష కడితే పవన్ కళ్యాణ్ కి పోయేది ఏమీ లేదు. జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి కక్ష సాదింపు చర్యల వలన పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇంకా పెంచారు”అని వ్యాఖ్యనించారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. భీమ్లా నాయక్ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు జేసీ. పవన్ కల్యాణ్‌పై కక్ష సాధింపు చర్యల ద్వార పవన్ కి తగ్గేది ఏమీలేదని, ఆయన చక్కగా ఏసీ రూములో కూర్చున్నా ఆయనకేం సమస్య లేదని చెప్పిన జేసీ.. పాపం థియేటర్, థియేటర్ కి వచ్చే ప్రేక్షకుల పై ఆధారపడి బ్రతుకున్న బతుకులు జగన్ మోహన్ రెడ్డి కక్ష్య సాదింపు కారణంగా నాశనం అవుతన్నాయని చెప్పుకొచ్చారు.
”భీమ్లా నాయక్ పై కక్ష సాదిస్తే ఏపీలో కలెక్షన్లు తగ్గుతాయేమో.. కానీ సినిమా విజయాన్ని ఆపలేరు. ఏపీలో కాకపోతే తెలంగాణలో కలెక్షన్లు వస్తాయి. హైదరాబాద్ బ్రహ్మండంగా బాగుపడుతుంది. దక్షిణాది సినిమానే కాదు.. బాలీవుడ్ సినిమా పరిశ్రమ కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నది. కానీ జగన్ మోహన్ రెడ్డి చర్యల వలన భవిష్యత్ లో దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఆంధ్రప్రదేశ్‌లో షూటింగులు చేయడమే ఆపేస్తారు. ఇప్పటికే రాష్ట్రం బ్రస్టుపట్టుకుపోయింది. అనవసరమైన ఈగోకి పొతే జగన్ మోహన్ రెడ్డి సరైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ ,చిరంజీవిలకు ఏమీ కాదు. వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళు కష్టాన్ని నమ్ముకున్నారు. పాపం.. మొన్న చిరంజీవిని చూసి జాలి కలిగింది. చేతులు జోడించి నమస్కారించాడు. చిరంజీవికి ఏం తక్కువ. అతను ఇండస్ట్రీని నమ్ముకొని కష్టపడి పైకి వచ్చాడు. ఇండస్ట్రీ కోసం నీ ముందు చేతులు జోడించాడు. దాన్ని కూడా వీడియోగా తీసి పబ్లిసిటీ చేసుకున్నావ్. ఇంత ఈగో పనికి రాదు” అని హితవు పలికారు జేసీ.