ఇదిగో రాజీనామా.. అదిగో రాజీనామా అని హడావుడి చేస్తున్న జగ్గారెడ్డి అసలు ప్రకటన చేయలేదు. అనుచరులతో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాజీనామా ప్రకటన చేస్తారేమోనని కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఎంతో ఆశగా ఎదురు చూసింది.కానీ ఆయన మాత్రం తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేయనన్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ను కలిసే వరకు తాను రాజీనామా చేయబోనని జగ్గారెడ్డి ప్రకటించారు. వ్యక్తిగత రాజకీయం కోసం కార్యకర్తలను ఇబ్బంది పెట్టనని చెప్పారు.
రాహుల్ నాయకత్వంలో మార్చి 21న లక్ష మందితో సభ నిర్వహిస్తానని, ఆ సభలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
సోనియా, రాహుల్‌ల ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తానని జగ్గారెడ్డి చెబుతున్నారు. అయితే ఆయన సభకు హైకమాండ్ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉండదని అందరికీ తెలుసు. తాను చెప్పాలనుకున్నది నేరుగా హైకమాండ్‌కే చెబుతానని జగ్గారెడ్డి అంటున్నారు. మార్చి ఇరవై ఒకటో తేదీ లోపు హైకమాండ్ నుంచి పిలుపు రాకపోతే తాను నిర్వహించబోయే బహిరంగసభా వేదిక నుంచి రాజీనామా ప్రకటించి ఆ తర్వాత ఏదో ఓ పార్టీలో చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కానీ జగ్గారెడ్డి పార్టీని బద్నాం చేయాడనికే ఈ డ్రామాలన్నీ వేస్తున్నరని.. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను పట్టుకుని వాటిని పీసీసీ చీఫ్‌కు అన్వయించి రచ్చ చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.పార్టీలో ఉంటే ఉండాలి ..పోతే పోవాలి కానీ ఈ డ్రామాలేంటని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఇదేందో మరి ఆ జగ్గారెడ్డికే తెలియాలి.