ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ దర్శకుడు. మార్చి 11న `రాధేశ్యామ్` విడుదలకు సిద్ధమైంది. ఇప్పటి నుంచే ప్రమోషన్ కార్యక్రమాలకు చిత్రబృందం శ్రీకారం చుట్టింది. హిందీ వెర్షన్‌కి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో వాయిస్ ఓవర్ ఇప్పించారు. తెలుగు వెర్షన్‌కి మహేష్ బాబు గొంతు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా కథని రాజమౌళి పరిచయం చేయబోతున్నారు. అవును… ‘రాధే శ్యామ్’కి రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ప్రభాస్ – రాజమౌళిల అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కోసం రాజమౌళి, రాజమౌళి కోసం ప్రభాస్ ఏమైనా చేస్తారు. ఇప్పుడు `రాధే శ్యామ్` ప్రమోషన్లలో తన వంతు పాత్రని రాజమౌళి పోషిస్తున్నారు. త్వరలోనే బాలీవుడ్ లో ఓ ఈవెంట్ ని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. హైదరాబాద్ లోనూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తారు. ఈ రెండింటిలో ఒక చోట రాజమౌళి ప్రెజెన్స్ కనిపించబోతోంది.