మెగా అభిమానుల్లో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న సాయి చేసిన మూడు సినిమాలకే తానో స్టార్ లా ఫీల్ అవుతున్నాడు. అయితే దీనిలో తన తప్పు ఎంత ఉందో తెలియదు కాని సాయి స్టామినాను సినిమా సినిమాకు పెంచేస్తున్నారు దర్శక నిర్మాతలు. పిల్లానువ్వు లేని జీవితం ఒక్క సినిమా హిట్ కొట్టిన ఈ మెగా కుర్రాడికి సుప్రీం హీరో అనే టెటిల్ ఇచ్చి సుబ్రమణ్యం టైటిల్స్ లో వేసేశాడు దిల్ రాజు.
ఆ హవాతో ఇప్పుడు తను గోపిచంద్ తో తీయబోతున్న సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అయితే ‘గ్యాంగ్ లీడర్’ అంటే మెగాస్టార్ మెగా పవర్ ను తెలియచేసే సినిమా.. మరి అలాంటి సినిమా మెగా పవర్ స్టార్ వాడకుండా సాయి ధరం తేజ్ వాడడం ఎంతవరకు సమంజసం అనేది అభిమానుల్లో చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు కొంతమంది వీర అభిమానులు ఆ టైటిల్ కేవలం రాం చరణ్ మాత్రమే వాడాలని సోషల్ సైట్స్ లో వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు.
అయితే కొసమెరుపు ఏంటంటే సాయి ధరం తేజ్, గోపిచంద్ ల సినిమా ఇంకా టైటిల్ అనుకోలేదట. మరి ఒకవేళ అనుకున్నా మెగా అభిమానులనుండి వచ్చిన ఈ యాంటి పబ్లిసిటీకి వెనక్కి ఏమన్నా తగ్గారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి మెగా అభిమానుల నుండి సాయి ధరం తేజ్ కు మొదటి షాక్ తగిలినట్టే అన్నమాట.