ప్రతిభ గల దర్శకుడు గుణశేఖర్ తన తర్వాత ప్రాజెక్ట్ గా ప్రతాపరుద్రుడు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. రుద్రమదేవి సినిమాతో విమర్శకుల ప్రశంసలను పొందిన గుణశేఖర్ ఆ సినిమా కోసం పడ్డ కష్టం సినిమాలో కనిపించింది. అయితే కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి ప్రతాపరుద్రుడు సినిమా రూపొందించే ఆలోచన ఉన్నట్టు రుద్రమదేవి ఎండ్ కార్డ్ లో వేశాడు.
అయితే ఈ సినిమాలో హీరోగా రుద్రమదేవిలో గోనగన్నారెడ్డిగా అదరగొట్టిన అల్లు అర్జున్ చేస్తాడంటూ వార్తలు వచ్చాయి. కాని ప్రస్తుతం ప్రతాపరుద్రుడు పాత్రకు యంగ్ రెబల్ స్టార్ ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడట గుణశేఖర్. బాహుబలితో దేశం మొత్తం క్రేజ్ సంపాధించిన ప్రభాస్ ప్రతాపరుద్రుడిగా కూడా నప్పుతాడనే నమ్మకంతో ఈ నిర్ణయానికి వచ్చారట గుణ అండ్ టీం.
బాహుబలి-2 ఆ తర్వాత సుజిత్ సినిమా చేసే ఆలోచనలో ఉన్న ప్రభాస్ ఈ ప్రతాపరుద్రుడికి డేట్స్ ఇస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే రుద్రమదేవిని 3 సంవత్సరాలు తీసిన గుణశేఖర్ ఈ ప్రతాపరుద్రుడు ఇంకెన్ని సంవత్సరాలు తీస్తాడో.. మరి సంవత్సరాలు సంవత్సరాలు గుణశేఖర్ మీద నమ్మకంతో ప్రభాస్ డేట్స్ ఇచ్చే సాహసం చేస్తాడా అన్నదే ఇప్పుడు అందరి మదిలో మొదలైన ఆలోచన. మరి దీనికి సమాధానం దొరకాలంటే సినిమా గురించి అధికారిక ప్రకటన ఏదైనా వస్తేనేగాని తెలియదు.