”భీమ్లా నాయక్’ సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ లాంటి మాస్ స్టార్ ని అందరికీ నచ్చేలే చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు సాగర్ చంద్ర. పవన్ కళ్యాణ్ హిట్ దర్శకుల లిస్టు లో చేరిపోయాడు. ఇప్పుడు భీమ్లా నాయక్ సక్సెస్ ఫలాలు అందుకుంటున్నాడు. యంగ్ అండ్ స్టార్ హీరోలు సాగర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వరుణ్ తేజ్ తో ఓ సినిమా దాదాపు ఓకే అయ్యింది. ఏకె ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మించనుంది. అయితే బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఆలోచనలో వున్నారు. సాగర్, వరుణ్ కోసం చేసుకున్న కథ ఓ పిరియాడికల్ డ్రామా. చాలా బడ్జెట్ అవుతుంది. నిర్మాతలు ప్రస్తుతం సాధ్యాసాధ్యాల గురించి ఆలోచిస్తున్నారు.
ఇదే కాకుండా హీరో నాని , రామ్ లు కూడా సాగర్ చంద్ర తో టచ్ లో వున్నారు. సాగర్ గతంలో ‘అప్పట్లో ఒకడుండే వాడు’ సినిమా తీశాడు. ఈ ఫిల్మ్ లవర్స్ ని ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది సాగర్ పనితీరుకి ఫ్యాన్స్ అయ్యారు. కొంతమంది హీరోలు సాగర్ తో టచ్ లోకి వెళ్ళారు. నాని కూడా సాగర్ తో సినిమా చేయాలనీ అనుకున్నాడు. రామ్ కి కూడా ఓ కథని సిద్దం చేశాడు సాగర్. ఇప్పుడు భీమ్లా నాయక్ సక్సెస్ తో పాటు పవన్ కళ్యాణ్ హిట్ సినిమా ఇమేజ్ తెచ్చుకున్నాడు సాగర్. దీంతో అన్ని గేట్లు తెరచుకున్నాయి. వరుణ్ తేజ్ తో సినిమా దాదాపు ఫైనల్ అయ్యింది. అయితే బడ్జెట్ కారణాలు వలన ఇది సెట్స్ పైకి వెళ్ళడం ఆలస్యం అయితే మాత్రం నాని లేదా రామ్ ఇద్దరిలో ఒకరితో సాగర్ కొత్త సినిమా వుండే అవకాశం వుంది.