వైష్ణవ్ తేజ్ మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు. వైష్ణవ్ సరసన ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ ఆసక్తిని క్రియేట్ చేశాయి. బటర్ ఫ్లై కిస్ అంటూ విడుదల చేసిన ఓ టీజర్ .. సినిమాకి రొమాంటిక్ ఇమేజ్ ని తెచ్చింది. అయితే టీజర్ లో వున్నట్లు ఇది పూర్తిగా రొమాంటిక్ ఎంటర్ ట్రైనర్ కాదు. ఈ కథకి పొలిటికల్ టచ్ కూడా ఇచ్చార్ట. పైకి ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ లుక్‌లో కనిపిస్తున్న కథలో ఓ పొలిటికల్ డ్రామా వుందని తెలిసింది. ఆ పొలిటికల్ డ్రామా చాలా కొత్తగా వుంటుందని, ఆ పాయింట్ నచ్చే వైష్ణవ్ తేజ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేశారాని తెలిసింది. చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మే 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.