వెంకటేష్, అనిల్ రావిపూడి కథానాయకులుగా నటించిన చిత్రం `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎఫ్ 2లో కంటే డబుల్ ఫన్ ఉండేలా చూసుకుంటున్నాడు అనిల్. కొన్ని కామెడీ ట్రాకులు రాసుకున్నాడు. ప్రేక్షకుల్ని నవ్వించడానికి ఈసారి కాస్త ఫాంటసీని కూడా జోడించాడట. ఓ సీన్‌లో కేసీఆర్‌నీ, జగన్ నీ తీసుకొచ్చాడట. వరుణ్‌తేజ్ కేసీఆర్, జగన్‌లతో లంచ్ చేస్తున్నట్టు ఓ సీన్ డిసైజ్ చేశాడట. అదంతా గ్రాఫిక్స్ లో సెట్ చేసినట్టు టాక్. `ఎఫ్ 3` పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్. ఇందులో పాలిటిక్స్ కి చోటు లేదు. అయినా ఓ సరదా సీన్ కోసమే.. ఇలా కేసీఆర్,జగన్‌లను వాడుకున్నాడట అనిల్ రావిపూడి. ఆ సీన్ కూడా చాలా హిలేరియస్‌గా పండిందని టాక్. ఎఫ్ 2లో లేని కొత్త క్యారెక్టర్లు ఇందులో కొన్ని కనిపిస్తాయి. సునీల్ ఎఫ్ 2లో లేడు. కానీ ఎఫ్ 3లో ఉన్నాడు. తన పాత్రపై కూడా చాలా ఫన్ నడుస్తుందని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ కథానాయికలు.