RRR ప్రమోషన్ల జాతర మరోసారి మొదలు కానుంది. సంక్రాంతికి ముందు ఈ సినిమా ప్రమోషన్లు ఓ రేంజ్లో జరిగాయి. అయితే సినిమా వాయిదా పడడంతో, ఆ ప్రయత్నం, ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇప్పుడు ఫిబ్రవరి 25న ఆర్.ఆర్.ఆర్ విడుదలకు సిద్ధమైంది. ఈసారి కూడా ప్రమోషన్లు భారీగానే చేద్దామనుకుంటున్నారు. రాధేశ్యామ్ హడావుడి అయిపోయిన వెంటనే, ఆర్.ఆర్.ఆర్ హంగామా మొదలవుతుంది.
అయితే ఈసారి ప్రమోషన్లకు అలియాభట్ రాకపోవొచ్చు. దానికి చాలా కారణాలున్నాయి. అందులో మొదటిది.. అలియా ఫుల్ బిజీగా ఉంది. ప్రమోషన్లకు టైమ్ ఇచ్చేంత తీరిక తనకు లేదు. పైగా.. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్లు ఎప్పుడో అవ్వగొట్టేశానన్నది తన ఫీలింగ్. మరోవైపు అలియాని భరించడం నిర్మాణ సంస్థకూ కష్టమే. గత సీజన్ అలియా ప్రమోషన్లకు 15 రోజులు కేటాయించింది. ఆ 15 రోజుల్లో అలియా ఖర్చు 3 కోట్లకుపైగానే అని టాక్. అలియా, తన స్టాఫ్‌కి ప్రత్యేక విమానాలు, హోటెల్ రూమ్‌లు… వీటికి అక్షరాలా మూడు కోట్లయ్యాయని టాక్. ఈసారీ ఇంచుమించుగా అంతే అవుతుంది. అలియా ప్రమోషన్లలో ఉండడం వల్ల ఆర్.ఆర్.ఆర్కి ప్రత్యేకమైన గుర్తింపు, మైలేజీ ఏం ఉండదు.కాబట్టి.. అలియా లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని ఆర్.ఆర్.ఆర్ చిత్రబృందం భావిస్తోంది. అలియా మహాఅయితే ముంబై ఈవెంట్లో కనిపిస్తుందంతే. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఈవెంట్లలో అలియా ఉండకపోవొచ్చు.