ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ఏపీ అసెంబ్లీలో సంతాపం చెప్పకపోవడం వివాదాస్పదమవుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగించారు.రెండో రోజు మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి సంతాపం తెలిపారు. కానీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను మాత్రం మర్చిపోయారు. మర్చిపోయారనే కంటే ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారనేది నిజం అనుకోవాలి.
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన రోశయ్య.. వైఎస్ కుటుంబానికి ఆత్మీయుడిగాఉన్నారు.ఆయన గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో కన్ను మూశారు.ఈ సందర్భంగా ఆయనను తెలుగు రాష్ట్రాలప్రజలు, నేతలు అందరూ గుర్తు చేసుకున్నారు. అయితే సంతాపం మాత్రం ప్రకటించిన సీఎం జగన్ ఆయనకు నివాళి అర్పించేందుకు వెళ్లలేదు. అప్పుడే రాజకీయ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఆయనకు అసెంబ్లీ ద్వారా సంతాపం తెలుపకుండా అవమానించారన్న విమర్శలు వస్తున్నాయి.
ఆర్యవైశ్య పెద్దగా ఉన్న రోశయ్య పట్ల సీఎం జగన్ కావాలనే ఇలా వ్యవహరిస్తున్నారని.. గతంలో తనను కాకుండా రోశయ్యను సీఎం చేశారన్న ఆగ్రహంతో జగన్ ఉన్నారని అంటున్నారు. మొత్తంగా చూస్తే..ఎన్నో ఏళ్ల పాటు అసెంబ్లీకి .., మండలికి ప్రాతినిధ్యం వహించిన రోశయ్యకు..చివరికి అక్కడ సంతాపం దక్కనిపరిస్థితి ఏర్పడింది.