2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,56, 257 కోట్ల రూపాయల అంచనాతో బడ్డెట్‌ను ప్రతిపాదించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇందులో రెవెన్యూ వ్యయం అంచా 2,08, 261 కోట్లగా పేర్కొన్నారు. మూలధన వ్యయం అంచనా 47,996 కోట్ల రూపాయలుగా చెప్పారు. అదే సమయంలో ద్రవ్యో లోటును రూ. ద్రవ్య లోటు 48, 724 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. అంటే మూలధనం వ్యవయం చేయడానికన్నా ద్రవ్యోలోటే ఎక్కువగా ఉంది. ఏ రూపంలోనూ అనుకున్నంతగా నిధుల సమీకరణ జరగకపోతే.. ఈ మూల ధన వ్యయాన్ని నిలిపివేసే అవకాశం ఉంది.
ఎందుకంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 30 వేలకోట్ల వరకూ లోటు అంచనా వేస్తే. ఆ లోటు లక్ష కోట్లకు దాటిపోయింది. ఇప్పుడా లోటును భర్తీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయినా ఈ ఏడాది గత ఏడాది కంటే మరింత ఎక్కువగా ద్రవ్యలోటును ప్రతిపాదించారు. బడ్జెట్లో కేటాయింపులను ఓ సారి సబ్ ప్లాన్ రూపంలో చూపించారు. మరోసారి శాఖల వారీగా చూపించారు. మరోసారి పథకాల రూపంలో చూపించారు. అంటే.. ఒక్క సారి చేసే ఖర్చును అటు సబ్ ప్లాన్లు… కార్పొరేషన్లకు కేటాయిస్తున్నట్లుగా.,. పథకాలకూ కేటాయిస్తున్నట్లుగా చూపించారు. ఇవన్నీ కేవలం పథకాల కింద కేటాయిపులే చేశారు. ఎప్పట్లాగే బడ్జెట్లో పథకాలకు కేటాయింపులు మాత్రమే ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులనే ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌గా మంత్రి కన్నబాబు మరోసారి చదివి వినిపించారు.
బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో అన్నీ అబద్దాలే చెబుతున్నారంటూ టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. వారిపై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. లోటుగా ఉన్న ఆదాయాన్ని ఎలా సమీకరించుకుంటారో.. ఏపీ ప్రభుత్వం చెప్పలేదు. కానీ ఆర్థిక వృద్ధి బాగా ఉందని… మంత్రి బుగ్గన చెప్పారు. మామూలుగా రాష్ట్రాల బడ్జెట్ అయినా ప్రజలకు ఆసక్తి ఉండేది. కానీ ఇటీవలి కాలంలో సంక్షేమపథకాలకు కేటాయింపులుతప్ప బడ్జెట్లలో ఏమీ ఉండకపోతూండటంతో ప్రజలకు కూడా ఆసక్తి సన్నగిల్లింది.