వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మళ్లీ మెగా ఫోన్ పట్టుకోవాలన్న ఉత్సాహం చూపిస్తన్నారు. ఈ వయసులోనూ ఆయనకు ఓ డ్రీమ్ ప్రాజెక్టు ఉంది. అదే `బెంగళూరు నాగరత్నమ్మ` బయోపిక్. ఇదో దేవదాసీ జీవితం తన జీవితంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కమర్షియల్ గానూ స్ట్రాంగ్ కథ ఇది. అందుకే ఆమె కథని సినిమాగా తీయాలన్నది సింగీతం ఆలోచన. కథ కూడా రెడీ అయిపోయింది. టాలీవుడ్ లో స్టార్ రచయితగా పేరొందిన బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. డైలాగ్ వర్షన్‌తో సహా స్క్రిప్టు పూర్తయ్యింది. బెంగళూరు నాగరత్నమ్మ గా సమంతని అనుకున్నారు. ఆమెకు ఈ కథ వినిపించారు కూడా. అయితే ఈ సినిమా చేయాలా, వద్దా? అనే డైలామాలో సమంత ఉండిపోయింది. ఇప్పుడు ఈ కథ అనుష్క దగ్గరకు చేరింది. ఇటీవల అనుష్కకు కథ మొత్తం వినిపించార్ట. అయితే అనుష్క ఇంకాస్త సమయం కావాలని అడిగిందని సమాచారం. నాగరత్నమ్త పాత్ర కాస్త బోల్డ్ గా ఉంటుంది. కాకపోతే ఎగ్రసీవ్ పాత్ర అది. స్టార్ హీరోయిన్ చేస్తేనే ఆ పాత్ర నిలబడుతుంది. అందుకే అనుష్క, సమంతల చుట్టూ కథ తిరుగుతోంది. మరి… సమంత, అనుష్కలలో నాగ రత్నమ్మ పాత్రని ఎవరు స్వీకరిస్తారో చూడాలి.