నిర్మాత బెల్లం కొండ సురేష్, ఆయన తనయుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. సినిమా నిర్మిస్తానంటూ బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు తన వద్ద డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని శరణ్ అనే ఒక వ్యక్తి కోర్టుని ఆశ్రయించి కేసు నమోదు చేయించాడు. కాగ ఈ కేసుపై బెల్లంకొండ సురేష్ స్పందించారు. తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొందరు కావాలనే తనపై కుట్ర పన్నుతున్నారని చెప్పారు. ‘నన్ను, నా ఫ్యామిలీ ని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది కుట్ర పన్నుతున్నారు. అందులో భాగమే నాపై నమోదైన ఈ కేసు. నాకు శరన్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు చూపించాలి. లేకపోతే అతనిపై పరువునష్టం దావా వేస్తాను’అని వెల్లడించారు.
ఇక కేసుపెట్టిన శరణ్ గురించి చెబుతూ.. శరణ్ ది మా ఊరే… పదేళ్ళ క్రితం పరిచయం.. టికెట్ల కోసం ఫోన్ చేస్తూ ఉండేవాడు. శరణ్ అనవసరంగా నా కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడు.. అతని క్షమించమని వేడుకున్నా నేను ఊరుకోను బ్లాక్ మెయిల్ ల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నాడు. శరణ్ వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు.. అతనెవరో త్వరలోనే బయట పెడతా” అని పేర్కోన్నారు బెల్లంకొండ.