ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా టీడీపీ అభ్యర్థులు అవుతారు అనుకున్న వారు చాలా నియోజకవర్గాల్లో పనులు ప్రారంభించేసుకున్నారు. అభ్యర్థిత్వాలు క్లిష్టంగా ఉన్న చోట్ల.. చంద్రబాబు కీలకమైన నేతలకు.. సూచనలు ఇచ్చి అక్కడకు వెళ్లి పని చేసుకోవాలని చెబుతున్నారు. ఈ క్రమలో గుడివాడలో టీడీపీకి సరైన అభ్యర్థి లేడు. గత ఎన్నికల్లో దేవినేని అవినాష్‌ను నిలబెట్టడంతో కాపు ఓట్లు రాలేదు. దీంతో టీడీపీకి మైనస్ అయింది.ఇప్పుడు అవినాష్ వైసీపీలో చేరిపోయాడు.
ఈ సారి నేరుగా వంగవీటి రాధకు.. గుడివాడలో చూసుకోవాలని చంద్రబాబు సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన అక్కడ ముందుగా సామాజికవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మెల్లగా తాను అక్కడ నుంచి పోటీ చేయబోతున్నా.. అనే సందేశాలను పంపిస్తున్నారు. కొడాలి నాని మిత్రుడు కావడంతో అక్కడ పోటీ చేయరని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే రాజకీయం.. రాజకీయమేనని.. మిత్రుత్వం.. మిత్రుత్వమేనని చెబుతున్నారు. చూస్తూంటే.. గుడివాడలో ఈసారి టైట్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది.