స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ కథానాయిక ఆమె. పైకి చాలా పద్ధతిగా కనిపిస్తుంది. అందరితోనూ కలిసి మెలసి ఉంటున్నట్టు పోజు కొడుతుంది. కానీ ఆమెకున్నంత ఈగో ఎవ్వరికీ లేదన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. అది మరోసారి బయటపడింది.
ఓ అగ్ర నిర్మాతతో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోందామె. సినిమా దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈసినిమాలో మరో పవర్ ఫుల్ ఫిమేల్ క్యారెక్టర్ ఉంది. ఓ స్టార్ హీరో తనయ ఈ పాత్ర పోషిస్తోంది. దాదాపుగా లేడీ విలన్ టైపు పాత్ర అది. ఈ హీరోయిన్, ఆ లేడీ విలన్ ల మధ్య ఓ సీన్ తీశారు ఇటీవల. ఆ సీన్లో తన కంటే.. విలన్ కాస్య్టూమ్సే బాగున్నాయని ఆ హీరోయిన్ అలిగి వెళ్లిపోయిందట. ఆ తరవాత కో డైరెక్టర్ ని తన కార్ వాన్లోకి పిలిచి, చడామడా తిట్టిపోసిందట. ఈ రభతో ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని తెలుస్తోంది. ఈ హీరోయిన్ కార్వాన్ లో రంకెలు వేయడం, సెట్లో అందరికీ తెలిసిపోయింది. ఆ లేడీ విలన్‌కి కూడా. దాంతో ఇద్దరి మధ్యా మాటలు లేకుండా పోయాయని తెలుస్తోంది. కెమెరా ముందు.. ఆ కొద్దిసేపూ నటిస్తూ, షాట్ ఓకే అయిపోయిన తరవాత, ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోతున్నారని, ఈ కోల్డ్ వార్ ని టీమ్ కూడా.. భరించలేకపోతోందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.