ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా హాలీవుడ్ లో స్థాయిలో వుంది కానీ ఆసక్తికరంగా లేదనేది చాలా మంది విమర్శకులు, ప్రేక్షకుల మాట. అయితే బాలీవుడ్ లో మాత్రం ఇందుకు భిన్నంగా ప్రచారం జరుగుతుంది. తరుణ్ ఆదర్స్, సుమిత్ కడెల్, అనుపమ్ చోప్రా లాంటి బాలీవుడ్ క్రిటిక్ అండ్ ట్రేడ్ పండిట్స్ రాధేశ్యామ్ ఫ్లాఫ్ అని సోషల్ మీడియా హ్యండిల్స్ ప్రచారం చేస్తున్నారు. అక్కడితో ఆగడం లేదు. ‘కాశ్మీర్ ఫైల్స్’ ధాటికి రాధేశ్యామ్ నిలబడలేకపొతుందని వ్యాఖ్యనిస్తున్నారు. రాధేశ్యామ్ హిందీ బెల్ట్ లో అతిపెద్ద డిజాస్టర్ దిశగా వెళుతుందని చెబుతున్నారు. నిజానికి ‘రాధేశ్యామ్’ విషయంలో బాలీవుడ్ మొదటి నుంచి పక్షపాతంగానే వుంది. ఇప్పుడు కొంత నెగిటివ్ గా వచ్చేసరికి ఏకంగా డిజాస్టర్, అట్టర్ ఫ్లాఫ్ అనే ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంది బాలీవుడ్.
సినిమా బాలేదని చెప్పడం వరకూ ఓకే .. కానీ అసలు సినిమాలో ఏమీ లేదన్నట్టు ప్రచారం జరగడం మాత్రం కరెక్ట్ కాదు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ‘రాధేశ్యామ్’ లాంటి క్యాలిటీ తీసిన సినిమా ఏది? అంటే కాస్త అలోచించుకోవాలి. ఆ స్థాయిలో రాధేశ్యామ్ చిత్రీకరణ జరిగింది. ఫర్మార్మెన్స్, విజువల్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ .. ఇలా అన్నీ విభాగాల్లో ప్రపంచస్థాయి పనితీరు కనిపించింది. సినిమా ఎక్కువ మందికి నచ్చిందా లేదా? అనేది పక్కన పెడితే.. క్యాలిటీ విషయంలో రాధేశ్యామ్ తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.
బాలీవుడ్ వర్గాలకు ఇక్కడే భయం పట్టుకున్నట్లువుంది. మొదటినుంచి సౌత్ సినిమాల ఆధిపత్యం ని బాలీవుడ్ సహించలేదు. కానీ బాహుబలితో సహించక తప్పలేదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు తెలుగు నుంచే వస్తున్నాయి. అర్జున్ రెడ్డి, జెర్సీ.. లాంటి సినిమాలు బాలీవుడ్ కి రీమేకులు గా వెళ్ళాయి. ఇక ‘పుష్ప’ సినిమా బాలీవుడ్ కి పెద్ద ఛాలెంజ్ విసిరింది. అక్కడి ప్రేక్షకులు కూడా ”పుష్ప లాంటి సినిమా తీయడం బాలీవుడ్ కి చేతకాదా ?” అంటూ ట్రోల్స్ చేశారు. సరైన సమయం కోసం చూస్తున్న బాలీవుడ్ వర్గాల ,,. ఇప్పుడు రాధేశ్యామ్ ని తక్కువగా చేసే ప్రయత్నం చేస్తున్నాయి. సినిమా స్టాండర్ద్ గురించి పక్కన పెట్టేసి కేవలం ఫ్లాప్ అనే ప్రచారం చేయడానికే మొగ్గు చూపిస్తున్నట్లు కనిపిస్తుంది.