ఎన్టీఆర్, రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం చాలా త్యాగం చేశారు. వాళ్ళ త్యాగం వలనే సినిమా ఇంత గ్రాండ్ గా బయటికి వస్తుంది” అని వ్యాఖ్యానించారు దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళిల భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్దమౌతుంది. ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్స్ లో బాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఓవర్ బడ్జెట్ అయ్యింది. పలు కారణాల వలన విడుదల కూడా ఆలస్యం అవ్వడం చేత వడ్డీలు కూడా డబుల్ అయ్యాయి. ఇలాంటి నేపధ్యంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ రేమ్యునిరేషన్ ని తగ్గించుకున్నారా ? అనే ప్రశ్న ఎదురైయింది.
ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ.. ” రామ్ చరణ్ , ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కోసం చాలా త్యాగాలు చేశారు. దాదాపు నాలుగేళ్ళు ఈ ప్రాజెక్ట్ లో వుండిపోయారు. అనేక కారణాల వల్ల వర్కింగ్ డేస్ పెరిగిపోతున్నా ఓపిక పట్టారు. ఈ సమయంలో వారిద్దరూ వేరే సినిమాలు చేసుకుంటే బోలెడు డబ్బులు సంపాదించుకునేవారు. కానీ ఆర్ఆర్ఆర్ కోసం ఆగారు. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకూ ప్రాజెక్ట్ ఒకే ఫోకస్ తో వున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం వీరిద్దరు చేసిన త్యాగం చాలా పెద్దది” అని వ్యాఖ్యానించారు రాజమౌళి