వెబ్ సిరిస్ ల ట్రెండ్ టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే జోరందుకుంది. నవీన్ చంద్ర చేసిన ‘పరంపర’ వెబ్ సిరిస్ కి మంచి ఆదరణ లభించింది. మొదటి సీజన్ రెండో సీజన్ పై ఆసక్తి పెంచడంలో విజయం సాధించింది. ఇప్పుడు హీరో సుశాంత్ కూడా ఓ వెబ్ సిరిస్ కి సైన్ చేశాడు. జీ5 ప్రసారం కానున్న ఓ వెబ్ సిరిస్ లో ప్రధాన పాత్ర పోహిస్తున్నాడు సుశాంత్. ఈ రోజు సుశాంత్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని కూడా విలుదల చేశారు. ”వరుడు కావలెను’ చిత్రంతో ఆకట్టుకున్న లక్ష్మీ సౌజన్య ఈ వెబ్ సిరిస్ కి దర్శకత్వం వహిస్తుంది. చి౹౹ల౹౹సౌ౹౹ తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిన సుశాంత్.. కేవలం హీరో పాత్రలే కాకుండా కీలక పాత్రలు వేసే అవకాశం వస్తే ఓకే చేస్తున్నాడు. “అల వైకుంఠ పురములో’ విజయం కూడా సుశాంత్ కి కొత్త ఫామ్ తెచ్చింది. రవితేజ ‘రావణాసుర’ సినిమాలో కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పుడు వెబ్ సిరిస్ లో కూడా సందడి చేయడానికి రెడీ అయ్యాడు సుశాంత్. ఈ వెబ్ సిరిస్ ని ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు.