ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..అందరూ తనను రాజ్యాంగేతర శక్తి అంటున్నారని.. ప్రతీ విషయంలోనూ ఆయనే కల్పించుకుంటున్నారని . .. ఆయనకేం అధికారం ఉందని ప్రశ్నిస్తున్నారని ఫీలవుతున్నారు. అందకే తనకూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ఉందని చెప్పడానికి ఓ పదవి తీసుకోవాలని ఆయన డిసైడయినట్లుగా ప్రచారం జరుగుతోంది. మొదటగా ఆయన పేరు రాజ్యసభ రేసులో వినిపించింది. తరవాత ఆయన పేరు మంత్రిగా పేరు ప్రచారంలోకి వచ్చింది .
త్వరలో సీఎం జగన్ మంత్రి వర్గాన్ని మార్చబోతున్నారు. ఈ క్రమంలో సజ్జల పేరు కూడా పార్టీ అంతర్గత చర్చల్లో జోరుగా వినిపిస్తోంది. అధికార విధుల్లో సీఎం జగన్ కన్నా సజ్జలే క్రియాశీలకంగా ఉన్నారు. ముఖ్యమంత్రితో పని ఉన్న ప్రతి ఒక్కరూ సజ్జలను కలుస్తున్నారు. అయితే అసలు ఆయన అధికారం ఏమిటన్న ప్రశ్న వస్తోంది. ఈ కారణంగా సజ్జల ప్రభుత్వంలో భాగం కావాలనుకుంటున్నారని తెలుస్తోంది. రాజ్యసభ అయితే.. నేరుగా రాష్ట్ర ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడానికి ఉండదు. అదే రాష్ట్రంలో మంత్రిగా అయితే అన్ని పనులు అధికారికంగానే చక్కబెట్టవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం సజ్జల ఏపీ ప్రభుత్వంలో జగన్ కన్నా బలవంతుడనుకోవాలి. ఆయన చెప్పిందే జగన్ చేస్తారు. ఎవరెవరికి పదవులు ఇవ్వాలనేది సజ్జల నిర్ణయిస్తారు. ఈ క్రమంలో తాను పదవి తీసుకోవాలనుకుంటే అది క్షణాల్లో పని. ఆ ఏ తరహా రాజ్యాంగ పదవిని కోరుకుంటున్నారన్నదే ఇప్పుడు కీలకమని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.