తెలంగాణ , ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆయన పర్యటన పూర్తిగా అధికారికం. కేటీఆర్‌తో పాటు తెలంగాణ అధికారుల బృందం కూడా వెళ్తోంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కేటీఆర్ బృందం వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 29 వరకు అమెరికాలోని తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపూరి ఉన్నారు. పర్యటనలో భాగంగా ప్రముఖ సంస్థల అధిపతులు, సీఈవో లతో కేటీఆర్ భేటీ అవుతారు.
అంతర్జాతీయ కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ సంస్థలు హైదరాబాద్‌ను తమ వ్యాపార విస్తరణకు కేంద్రంగా మార్చుకున్నాయి. ఒక్క సాఫ్ట్వేర్ కంపనీలే కాకుండా…ఫార్మా, ఆటోమోబైల్, టెక్స్ టైల్స్, బయో, లైఫ్ సైన్సెస్‌లాంటి అనేక రంగాల సంస్థలు తరలివచ్చాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ ..డేటా సెంటర్‌ను ప్రకటించింది. వీటితో పాటు మరికొన్ని పెట్టుబడుల ప్రతిపాదనలపైనా కేటీఆర్ అమెరికాలో చర్చలు జరిపే అవకాశం ఉంది.
మన ఊరు – మన బడి పథకానికి ఎన్ఆర్ఐల నుంచి పెద్ద ఎత్తున విరాళాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ సర్కార్. ఈ దిశగా ప్రవాస తెలంగాణ పౌరులతోనూ సమావేశాలు జరిపి విరాళాలు సేకరించే అవకాశం ఉంది. కేటీఆర్ అమెరికాలో పది రోజులు ఉంటూండటంతో అమెరికాలోని తెలంగాణ వాసులు.. టీఆర్ఎస్ సానుభూతిపరుల్లో సందడి నెలకొంది.