సినిమాకి సంబంధించిన ఏ విషయమైనా సర్ప్రైజ్గా ఉంచాలనుకుంటుంది చిత్రబృందం. పాటో, ఫస్ట్ లుక్కో, టీజరో.. ఇవన్నీ అఫీషయల్గా వచ్చేంత వరకూ… దాచి ఉంచాల్సిన బాధ్యత చిత్రబృందానిదే. బడా స్టార్ల సినిమాల విషయంలో అయితే ఈ విషయంలో మరింత గోప్యత అవసరం. కానీ… `సర్కారు వారి పాట` విషయంలో ఇదంతా రివర్స్ అవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ అప్ డేటూ… చిత్రబృందం ప్రకటించక ముందే వచ్చేస్తోంది. కళావతీ పాటైతే, ముందే లీకయిపోయింది. సెకండ్ సింగిల్ లో సితార కనిపిస్తుందన్న హింటు మీడియాకి ముందే వచ్చేసింది. ఇవన్నీ చిత్రబృందాన్ని కంగారు పెట్టే అంశాలే. ఏదైతే సర్ప్రైజ్గా ఉంటుందనుకుంటున్నారో, అది ముందే లీకయిపోవడం వల్ల ఆ థ్రిల్ మిస్సవుతోంది.
దీనిపై మహేష్ బాబు కూడా గుర్రుగానే ఉన్నాడని టాక్. కళావతీ పాట ముందే లీకయినప్పుడు మహేష్ ఫైర్ అయిపోయాడని దానికి నిర్మాతలు సైతం సమాధానం చెప్పలేకపోయారని టాక్. పాట లీకవ్వడం ఒక్కటే కాదు. అసలు సినిమాకి సంబంధించిన అన్ని విషయాలూ ముందే బయటకు ఎలా వెళ్తున్నాయని.. మహేష్ కొంచెం గట్టిగానే అడిగాడట. ఇక నుంచి…అప్ డేట్లు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉంటామని నిర్మాతలు సర్ది చెప్పారని తెలుస్తోంది. ప్రమోషన్స్ విషయంలో మహేష్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. తనకంటూ ఓ స్ట్రాటజీ ఉంటుంది. సర్కారు వారి పాట విషయంలో అది మిస్ అవుతోంది. అందుకే మహేష్ ఇంత హైరానా పడుతున్నాడు. ఈ విషయంలో మైత్రీ… ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.