తెలంగాణలో ఎన్నికల వేడితో పాటు మత చిచ్చు కూడా సమాంతరంగా ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నుంచి ఇది ప్రారంభమైంది. బోధన్‌లో ఈరో జు బంద్ పాటిస్తున్నారు. దీనికి కారణం బీజేపీ నేతలు శివాజీ విగ్రహాన్ని పెట్టాలనుకోవడం.. ఎంఐఎం నేతలు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టాలనుకోవడమే. బోధన్‌లో హిందూ, ముస్లింలు పోటీపడే స్థాయిలో ఉంటారు. బోధన్ నుంచి ఎప్పుడూ ముస్లిం ఎమ్మెల్యేనే గెలుస్తూ ఉంటారు
ఈ క్రమంలో బీజేపీ నేతలు బోధన్‌లో శివాజీ విగ్రహం పెట్టాలనుకున్నారు. అయితే దీనికి సంబంధించిన అనుమతులు రాలేదు. దీంతో రాత్రికి రాత్రే బోధన్ సెంటర్లో శివాజీ విగ్రహాన్ని తెచ్చి పెట్టారు. ఉదయమే అక్కడ విగ్రహం కన్పించే సరికి ప్రజలు ఆశ్చర్యపోయారు. అయితే ఇతర వర్గాలు ఊరుకోలేదు. తాము టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలనుకున్న చోట బలవంతంగా శివాజీ విగ్రహం పెట్టారని ఆందోళనలు ప్రారంభించారు. ఇవి అంతకంతకూ పెరిగిపోయాయి. చివరికి పోలీసులు బోధన్‌లో 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది.
ఈ వివాదం ఇలా ప్రారంభమైన వెంటనే.. బీజేపీ అలా హిందువులందరూ మేల్కోవాలని ప్రచారం ప్రారంభించింది. ఎంపీ అర్వింద్ .. మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేశారు. పోటీ వర్గం ఊరుకోవడం లేదు. పోలీసులు ఎంత నచ్చ చెప్పినా వినలేదు. దీంతో 144 సెక్షన్ విధించారు. ఈ రచ్చ ప్రాథమికనే.. దీన్ని ఏ స్థాయికి తీసుళ్తే తమకు ప్రయోజనమో.. ఆ స్థాయికి .. అటు బీజేపీ.. ఇటు ఎంఐఎం తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ.. తెలంగాణలో అత్యంత ప్రమాదకమైన మత చిచ్చు పెట్టారన్న సంగతిని మాత్రం ఎవరూ గుర్తుంచుకోవడం లేదు.