సుదీర్ఘ న్యాయపోరాటంలో విజయం సాధించిన సీఆర్డీఏ రైతులు ఇక నుంచి తమలో మరో కోణం చూపించబోతున్నారు. చట్టాన్ని ఉల్లంఘించారని … కనీస మౌలిక సదుపాయాలు కల్పించి ప్లాట్లను ఇంత వరకూ ఇవ్వలేదని.. దీనికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఆర్డీఏకి నోటీసులు జారీ చేశారు. సమాధానం ఇవ్వకపోతే.. కోర్టుకెళ్తామని ప్రకటించారు. రాజధాని రైతులకు ఒప్పందం జరిగిన మూడేళ్లలోపు ప్లాట్లను అన్ని సౌకర్యలతో అప్పగించాలన్నది నిబంధన. గత ప్రభుత్వ హయాంలో అప్పగింతంలు ప్రారంభమయ్యాయి. కొనీ జగన్ సర్కార్ వచ్చిన తర్వాత మొత్తం ఆపేశారు.
ప్లాట్ల అభివృద్ధి కూడా నిలిపివేశారు. తర్వాత మూడు రాజధానులన్నారు. ఈ వివాదంతో ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయినా ప్రభుత్వం మూడు రాజధానుల పాటే పాడుతోంది. ఇక లాభం లేదని.. న్యాయపోరాటానికి రాజధాని రైతులు నిర్ణయించుకున్నారు. ఒప్పందం ప్రకారం ఇంకా ప్లాట్లు ఇవ్వనందున.. నష్టపరిహారం చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాతకోర్టుకెళ్లే అవకాశం ఉంది. సీఆర్డీఏ చట్టం ప్రకారం చేయాల్సినవి ఉద్దేశపూర్వకంగా చేయలేదు కాబట్టి ఈ విషయంలో సీఆర్డీఏకు చట్ట పరంగా ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తున్నారు.
సీఆర్డీఏపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన ఏపీ రెరా కు కూడా నోటీసులు ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ అయిన రెరా కూడా రాజధాని విషయంలో రైతుల నుంచి చిక్కులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అధికారులు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఫోన్లు చేస్తున్నారు. కానీ.. మౌలిక సదుపాయాలు కల్పించకుడా ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.