తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ ఉద్యమానికి ఇతర రాష్ట్రాల రైతుల సంగతేమో కానీ తెలంగాణ రైతులు కదులుతారా అన్నది అసలు సందేహం. రైతులకు ధాన్యం కొనుగోలే కీలకం. అది ఎవరు చేస్తున్నారనేది పట్టించుకోదు. కానీ తెలంగాణలో అదికారంలో ఉంది టీఆర్ఎస్ . అందుకే అందరూ టీఆర్ఎస్నే అడుగుతారు. మరి తాము పోరాటం చేద్దాం రండి అంటే ఎందుకు కదులుతారు ? అందుకే కేసీఆర్ స్వయంగా వ్యూహాలు రచిస్తున్నారు.
సకల జనుల సమ్మె తరహాలో సకల రైతుల సమాహారంగా నిరసనలు, దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు తదితర పోరాట రూపాలను ఖరారు చేస్తున్నారు. 28న యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవం ఉన్నందున అది ముగిసిన తర్వాత నిర్దిష్ట నిరసన కార్యక్రమాన్ని రూపొందించనున్నదిారు. రైతుబంధు సమన్వయ సమితి బాధ్యుల ద్వారా అన్ని గ్రామాల్లోని రైతులను కదిలించి రోడ్డెక్కించాలనుకుంటున్నాపు, యాసంగిలో వరి పంట వేయవద్దని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడంతో సాగుకు దూరంగా ఉన్న రైతులు ఇప్పుడు నిరసనలు, ఆందోళనల్లో కలిసి వస్తారా అనేది టీఆర్ఎస్లో మరో డౌట్.
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి సన్నాహక సమావేశాలను ఎమ్మెల్యేలు నర్వహిస్తున్నారు. రైతులకు మద్దతుగా పార్టీ శ్రేణులు ఎలాగూ వస్తాయి కాబట్టి రైతుల్ని కూడా భాగస్వాములను చేయడంపై ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. పంటల సీజన్లో రైతుల బిజీ పనులను దృష్టిలో పెట్టుకుని వారిని ఉద్యమంలోకి కదిలించేలా ఫోకస్ పెట్టారు. రైతుల పేరుతో టీఆర్ఎస్ నేతలు మాత్రమే పాల్గొంటే ఎఫెక్ట్ రాదని.. భావిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేయడం ఇప్పుడు టీఆర్ఎస్ ముందున్న పెద్ద టాస్క్.