రవితేజ ఓ వైపు `రామారావు ఆన్ ట్యూటీ` చేస్తూనే, మరోవైపు `ధమాకా` కీ కాల్షీట్లు ఇచ్చేస్తున్నాడు. `రామారావు…`లో రవితేజ పాత్రేమిటో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు `ధమాకా`లో రవితేజ క్యారెక్టరేంటి? కథేమిటి? అనే విషయాల్లో కాస్త క్లూ దొరికింది.
ఇందులో రవితేజ పాత్ర రెండు షేడ్స్ లో ఉంటుంది. కొన్ని సార్లు ధనికుడిగా, ఇంకొన్నిసార్లు సాధారణ మధ్యతరగతి వాడిగా కనిపిస్తాడు. ఓ రవితేజ ఓ కంపెనీకి సీఈవో. అతన్ని చంపడానికి ఓ ముఠా తిరుగుతుంటుంది. వాళ్లకు మరో రవితేజ కనిపిస్తుంటాడు. ఇద్దరూ ఒక్కరేనా? లేదంటే ఒక్కడే ఇద్దరిలా నటిస్తున్నాడా? అనేది ఎవరికీ అర్థం కాదు. ఈ ట్విస్ట్ ఇంట్రవెల్లో రివీల్ అవుతుందని టాక్. అక్కడి నుంచి కథ మరో మలుపు తీసుకుంటుందని తెలుస్తోంది. నక్కిన త్రినాథరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. హీరోలు డ్యూయల్ రోల్ చేస్తే, అందులో ఓ హీరో గొప్పింటిబిడ్డ. మరోకడు పేదింట్లో పుడతాడు. ఇద్దరూ తారుమారు అవ్వడం… ఇలాంటి కథలు చాలానే చూశాం. `ధమాకా` కూడా ఇప్పుడు అలాంటి రాజు – పేద కథే అనిపిస్తోంది.