అమరావతి విషయంలో ప్రో వైసీపీ మీడిాయలోనూ మార్పు వస్తున్నట్లుగా కనిపిస్తోంది. అమరావతి విషయంలో రైతులు ఎన్ని ఆందోళనలు చేసినా.. ఎంత ఉద్యమం చేసినా పట్టించుకోని మీడియాలు ఇప్పుడు పాజిటివ్ వార్తలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఇంత కాలం టీవీ 9 అమరావతిని ప్రాధాన్యతాంశంగా గుర్తించలేదు. కానీ హఠాత్తుగా న విధానాన్ని్ మార్చుకుంది. ఇప్పుడు కొత్తగా అమరావతి రైతుల్నిపిలిచి వారి వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు . ప్రస్తుతం అమరావతిలోకొన్ని పనుల్ని ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది.
కోర్టు తీర్పును ధిక్కరించడం లేదు అని చెప్పేందుకు కొన్ని పనుల్ని ప్రారంభించారు. అమరావతి రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగా 80శాతం పూర్తయిన భవనాలను పూర్తిచేసేందుకు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీవీ9 కొంత మంది రైతుల్ని పిలిపించి అభిప్రాయాలను వినిపించే ప్రయత్నం చేసింది. ఇంతకు ముందురైతుల్ని అసలు పరిగణనలోకి తీసుకోలేదు.కానీ ఇప్పుడిప్పుడు కొద్దిగా మార్పు వస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటి వరకూ అమరావతిని నెగెటివ్‌గా ప్రాజెక్ట్ చేయడంలో టీవీ9 ముందు ఉంది. టీవీ9 యజమానికి హైదరాబాద్‌లో లెక్కకు మిక్కిలిగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉన్నాయి.అమరావతి ఊపందుకుంటే ఆయన వ్యాపారానికి భారీ దెబ్బ పడుతుంది.ఈ కారణంగానే నెగెటివ్ ప్రచారం చేశారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఏమైనా మనసు మార్చుకుందాలేకపోతే.. పాజిటివ్‌లో నెగెటివ్ ఏమైనావెదుకుతుందా అనేది ముందు ముందు చూడాలి.