తెలంగాణ నుంచి బీజేపీ ఒకరిని రాజ్యసభకు పంపేందుకు ప్రయత్నిస్తోందని ఓ వర్గం ప్రచారం చేస్తోంది.అయితే బీజేపీ పంపాలనుకుంటోంది బీజేపీ నేతను కాదని.. వ్యాపారవేత్త రామేశ్వరరావునని చెబుతున్నారు. చినజీయర్ స్వామితో పాటు కిషన్ రెడ్డి కూడా ఈ దిశగా లాబీయింగ్ చేశారని.. ఆయనను అస్సాం నుంచి రాజ్యసభకు పంపుతారన్న చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ రాష్ట్ర నేతల్లో మాత్రం ఈ అంశంపై ఎలాంటి సమాచారం లేదు. అయితే చాలా మంది ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. బీజేపీ రాజ్యసభ ఇస్తానన్న రామేశ్వరారవు తీసుకోరని.. ఆయనకు బీజేపీ కన్నా కేసీఆర్ ముఖ్యమని ఓ వర్గం చెబుతోంది.
మైహోం .. హైదరాబాద్ నలువైపులా వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టింది. వంద ఎకరాలు సమతామూర్తి విగ్రహానికి విరాళంగా ఇచ్చారంటే ఆసంస్థ భూబ్యాంక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత లగ్జరీ ఇళ్లను నిర్మించడంలో రాటుదేలిపోయిన ఈ సంస్థకు టీఆర్ఎస్..కేసీఆర్ సహకారం ఎంతో అవసరం కేసీఆర్ సహకారంతోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ సంస్థ అనూహ్యంగా ఎదిగింది. ఇటీవల తెలంగాణ సర్కార్ వేలం వేసిన భూముల్లో మైహోం.. ఆ సంస్థకు చెందిన అనుబంధ సంస్థలు.. వ్యాపార లావాదేవీలు ఉన్న సంస్థలే భూములు ద క్కించుకున్నాయి.
ఇలాంటివి చాలా లింకులు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు రాజ్యసభ కోసం కేసీఆర్తో గొడవ పెట్టుకుంటారా అన్నదే సందేహం. కేసీఆర్ తో దూరం అయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అయితే బీజేపీ అండగా ఉన్నా… తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉన్నా రామేశ్వరరావు బీజేపీ ఆఫర్ను అంగీకరించే అవకాశం ఉంది. అదేసమయంలో.. కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టి పడకుండా ఆయన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అందుకే.. కొన్ని కారణాలతో రామేశ్వరరావు పదవి తీసుకోరని కొంత మంది.. తీసుకుంటారని మరికొంత మంది చెబుతున్నారు. అంతిమంగా అసలు రామేశ్వరరావుకు ఆఫర్ వచ్చిందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.