అమరావతి రాజధానిగా అందరి ఆమోదంతో అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నామని అప్పుడు జగన్ కూడా అంగీకరించారని … ఇప్పుడు మడమ తిప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ప్రజాతీర్పు కోరాలని ఆయన డిమాండ్ చేశారు. ఆనాడు అమరావతి ప్రతిపాదన తీసుకొస్తే ఓకే చెప్పారని కాదు అంటే సీట్లు రావని తెలుసన్నారు. అందుకే అప్పుడు ఓకే చెప్పి గెలిచిన తర్వాత ఇప్పుడు నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. మూడు రాజధానులు అంటున్నారు అదే అంశంపై రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి తీర్పు కోరాలని.. అప్పుడు మూడు రాజధానులు అనాలని సవాల్ చేసారు.
జగన్ చేస్తున్నవన్నీ మోసాలు అబద్దాలేనని చంద్రబాబు తప్పు పట్టారు. అప్పట్లో కౌన్సిల్ను రద్దు చేస్తామన్నారు. బలం పెరిగిన తర్వాత రద్దును వెనక్కి తీసుకున్నారన్నారు. ప్రభుత్వం విశ్వసనీయత పోగొట్టుకున్నప్పుడు రైతులపై దాడులు చేసినప్పుడు ఆర్టికల్ 222 ప్రకారం హైకోర్టు జోక్యం చేసుకుంది. ఇక్కడ ప్రజలే సుప్రీం… ఇక్కడ నిన్ను నిరంకుశ పాలన చేయమని చెప్పలేదు. నీవు ప్రజల ఆస్తులకు రక్షకుడేవే కానీ డిక్టేటర్వి కావని చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సీఆర్డీఏలో రైతులు వెనక్కి పోతామంటే ప్రభుత్వం అంగీకరిస్తుందా… ఎవరూ అతిక్రమంచి వద్దని చెప్పాక కూడా ప్రభుత్వం ఎందుకు ఇష్టారీతిన ప్రవర్తిస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో మూడు రాజధానులు అని చెప్పి విధ్వేషాలు రెచ్చగొట్టారన్నారు. విజ్ఞత ఉంటే… సుప్రీంకోర్టుకు వెళ్లాలి.. అక్కడ ఇచ్చిన తీర్పున బట్టి ప్రవర్తించాల్సి ఉంటుందన్నారు.
శివరామకృష్ణ కమిటీ కూడా విజయవాడ గుంటూరు జిల్లా మధ్యలో పెట్టాలన్నారు. అప్పుడు దీనికి అంగీకరించామన్నారు. కోర్టు తీర్పునకు వక్రభాష్యం చెప్పారని.. పిటిషనర్లు న్యాయం చేయాలని కోరారన్నారు. తనకు అమరావతిలో ఇల్లు లేదనడంపై చంద్రబాబు స్పందించారు. నీకు విశాఖలో ఇల్లు కట్టుకుంటున్నావ్. విజయవాడలో కట్టుకున్నావ్ హైదరాబాద్లో ఉంది. చెన్నైలో ఉంది. బెంగళూరులో కూడా ఉంది. ఇడుపులపాయలో కూడా ఉందని గుర్తుచేశారు.