తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీపై చేస్తున్న వడ్ల దాడి విషయంలో బీజేపీ నేతలు నేరుగా ఎదురుదాడి చేయడానికి అందరూ ముందుకు రావడం లేదు. బండి సంజయ్ టీఆర్ఎస్పై మరో మట లేకుండా మండి పడుతున్నారు. కేంద్రం ఎలాంటి ప్రకటన చేసినా దాన్ని రైతులకు అనుకూలంగా మార్చి.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కానీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం నోరు తెరవడం లేదు. ఇది బీజేపీలో చర్చనీయాంశం అవుతోంది.
తెలంగాణ మంత్రులు.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశానికి వెళ్లారు. అక్కడ ఆయనతో మంత్రులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ వాదనకు మద్దతుగా మాట్లాడతారేమో అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పీయూష్ గోయల్ సమాచారం పంపారు. ఆయన కోసం సమావేశాన్ని పావు గంట సేపు నిలిపివేశారు . కానీ కిషన్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో గోయల్ కూడా అసహనం ఫీలయ్యారు.
ధాన్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం తప్పని.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం అని బలంగా చెప్పాల్సిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెర చాటుకు వెళ్లడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. బలమైన వాదన వినిపిచకుండా ఇలా చేయడం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. అయితే కేబినెట్ హోదా మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి టీఆర్ఎస్పై రివర్స్ అటాక్ చేయడంలో డిఫెన్సివ్‌గా ఉన్నారు. ఇది బీజేపీ నేతలను కూడా అసంతృప్తికి గురి చేస్తోంది.