తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల కష్టసుఖాల బాధ్యతలు చూసుకుంటున్న లోకేష్‌ను కలవడానికి ప్రతీ రోజూ చాలా మంది వస్తూంటారు. అలా నాగరాజు అనే కార్యకర్త కూడా తన కుమారుడితో కలిసి వచ్చారు. మదనపల్లికి చెందిన నాగరాజు మళ్లీ సీఎం కాాలని 115 సార్లు శ్రీనివాసుడికి మొక్కుకుని తిరుమల వెళ్లి వచ్చారు. ఓ సారి కుమారుడు మంజునాథతో వెళ్లి వస్తున్న సమయంలో చిన్న ప్రమాదం జరిగింది. కుమారుడి కాలుకు దెబ్బతగిలింది. లోకేష్‌కు కలవడానికి వచ్చిన సమయంలో ఈ విషయం ఆయనకు సిబ్బంది చెప్పారు. అదే సమయంలో నాగరాజు పుట్టిన రోజు అని కూడా చెప్పారు.
దీంతో లోకేష్ వెంటనే.. కేకు తెప్పించి నాగరాజు కుమారుడితో కట్ చేయించారు. వైద్య, విద్యకు అయ్యే ఖర్చు అంతా తాను చూసుకుంటానని ఏ మాత్రం దిగులు చెందవద్దని భరోసా ఇచ్చారు. అప్పటికప్పుడు రూ. పాతిక వేల సాయం చేశారు. దీంతో నాగరాజు, మంజునాధల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కార్యకర్తకు ఇంత గౌరవం ఇచ్చిన లోకేష్ శైలి ఇతర నేతలతో దటీజ్ లోకేష్ అనిపించింది.
ఇటీవల నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు జరిగింది. ఆ పుట్టిన రోజు నాడు కల్తీ సారా, కల్తీ మద్యం బ్రాండ్లపై పోరాటంలో భాగంగా అమరావతిలోనే ఉన్నారు. దీంతో లోకేష్ కుమారుడి పుట్టిన రోడు వేడుకల్లో పాల్గొనలేకపోయారు. కానీ కార్యకర్త కుమారుడి పుట్టిన రోజు వేడుకను మాత్రం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు హైకమాండ్‌కు మధ్య ఓ అనుబంధం ప్రారంభమైంది లోకేష్ ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాతే. లోకేష్ వచ్చిన తర్వాతే కార్యకర్తల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు. వారి కుటుంబాలకు ఆపద వస్తే ఆదుకునే కార్యక్రమాలు కూడా చేపట్టారు.
లోకేష్ కార్యకర్తలతో నేరుగా అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటికీ అనేక మందికి బయటకు తెలియని సాయాలు చేశారు. ఎవరికి ఎలాంటి సాయం అవసరం అయినా లోకేష్ టీంను సంప్రదించేవాళ్లు ఎక్కువగానే ఉంటారు. ఒకప్పుడు చంద్రబాబు అలా నేరుగా కార్యకర్తలతో టచ్‌లో ఉండేవారు. అధికార బాధ్యతలు పెరిగిన తర్వాత ఆ సంబంధాలు తగ్గిపోయాయి. ఇప్పుడా బాధ్యత లోకేష్ తీసుకున్నారు.